ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 dinner : జీ20 సదస్సు విందు.. నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం..

ABN, First Publish Date - 2023-09-08T10:52:40+05:30

అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు రావడం ప్రారంభమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ నగరానికి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.

న్యూఢిల్లీ : అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు రావడం ప్రారంభమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ నగరానికి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌ను సందర్శిస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం వివిధ దేశాధినేతల గౌరవార్థం ఇచ్చే విందుకు మాజీ ప్రధాన మంత్రులు దేవె గౌడ, మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించారు. ఈ విందుకు బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమత బెనర్జీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ శనివారం ఉదయం ఢిల్లీ నగరానికి బయల్దేరుతున్నారు. ఈ విందులో దాదాపు 500 మంది బిజినెస్ లీడర్స్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

నితీశ్ కుమార్ శనివారం ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ బయల్దేరుతారని తెలుస్తోంది. ఈ విందులో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం ఉంది. 2022 జూలై తర్వాత వీరిద్దరూ ముఖాముఖి కలవబోతుండటం ఇదే మొదటిసారి.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శనివారం విందుకు హాజరవుతున్నట్లు ధ్రువీకరించారు. రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడాన్ని మమత తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే.

బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోబోతున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన తొలిసారి భారత దేశానికి వస్తున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి అశ్విని చౌబే స్వాగతం పలుకుతారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషింద, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో ఆయన కోవిడ్ నిబంధనలను పాటిస్తారు.

స్పెయిన్ అధ్యక్షునికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో ఆయన ఈ సమావేశాలకు హాజరుకావడం లేదు. అర్జంటైనా అధ్యక్షుడు అల్బెర్టో ఏంజెల్ ఫెర్నాండెజ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T10:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising