I.N.D.I.A. alliance: ఆప్‌తో పొత్తుకు పంజాబ్ కాంగ్రెస్ గండి..?
ABN, First Publish Date - 2023-09-05T20:40:46+05:30
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని, తమ పార్టీ మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మంగళవారంనాడు ప్రకటించారు.
ఛండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో ఎలాంటి పొత్తులు ఉండవని, తమ పార్టీ మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (Amrinder Sing Raja warring) మంగళవారంనాడు ప్రకటించారు. ఇటీవల ముంబైలో 28 విపక్ష పార్టీలతో కూడిన 'ఇండియా' కూటమి సమావేశం కావడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ సమష్టిగా పోటీ చేయాలనే కృతనిశ్చయాన్ని ప్రకటించిన నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాజా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకూ కలిసికట్టుగానే పోటీ చేయాలని ముంబై సమావేశంలో ఇండియా కూటమి ఒక తీర్మానం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు సంబంధించిన ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని, ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆ తీర్మానం పేర్కొంది. అయితే, రాబోయే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్, ఆప్ అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Updated Date - 2023-09-05T20:40:52+05:30 IST