ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gehlot: కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈడీ నిరంతర దాడులే చెబుతున్నాయి: సీఎం

ABN, First Publish Date - 2023-10-23T17:57:31+05:30

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ (ED)నీ బీజేపీ (BJP) ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.


రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్-2021 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఇటీవల ఒక కోచింగ్ సెంటర్, ప్రైవేటు వ్యక్తులపై దాడులు జరిపింది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నాగపూర్, సికార్, జైపూర్‌లోని ఏడు ప్రాంతాల్లో దాడులు సాగించింది. వీటిపై అశోక్ గెహ్లాట్ సోమవారంనాడు ఒక ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. ఈడీ నిరంతర దాడులను బట్టే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే విషయం రూఢీ అవుతోందన్నారు. బీజేపీ రాజస్థాన్ ప్రజల విశ్వాసాన్ని సాధించలేకనే ఈడీని కాంగ్రెస్‌పై ఉసిగొలుపుతోందని ఆరోపించారు.


కాంగ్రెస్ హామీలపై..

కర్ణాటక తరహాలోనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలను కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రకటిస్తుందని గెహ్లాట్ తెలిపారు. తమ హామీలను మోదీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరేర్చామని, ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ హామీలకు సిద్ధంగా ఉందని చెప్పారు.


ముఖాముఖీ పోటీ..

రాజస్థాన్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. 200 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 25న పోలింగ్ జరుగనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి కీలకంగా పనిచేస్తుందని బీజేపీ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లకు పరిమితమైంది.

Updated Date - 2023-10-23T17:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising