ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha : మహిళా పోలీస్ అధికారిని నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-02-16T14:36:50+05:30

ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా (Jaynarayan Mishra) సంబల్‌పూర్‌లో ఓ మహిళా పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు.

Anita Pradhan, MLA Mishra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ : ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా (Jaynarayan Mishra) సంబల్‌పూర్‌లో ఓ మహిళా పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు. బీజేపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన ఆమెను నెట్టేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

సంబల్‌పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ధనుపాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి అనిత ప్రధాన్‌తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మిశ్రా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు.

అనిత ప్రధాన్ చెప్తున్నదాని ప్రకారం, బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మిశ్రాతో వాగ్వాదం జరిగింది. ఆయన ఆమెను లంచగొండి, బందిపోటు అని ఆరోపించారు. అటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన ఆమెను ఆయన నెట్టేశారు.

మిశ్రా మాట్లాడుతూ అనిత ప్రధాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళా కార్యకర్తలను పోలీసుల చిత్రహింసలు పెడుతున్నారని తనకు తెలిసిందన్నారు. ఆ సమాచారం తెలిసిన వెంటనే తాను ముందుకు వచ్చానన్నారు. అప్పుడు అనిత తనతో మాట్లాడుతూ ‘‘నువ్వు పోలీసులపై బాగా వాగుతున్నావు’’ అని అన్నారని, తనను నెట్టేశారని తెలిపారు. కానీ తాను మాత్రం ఆమెను నెట్టలేదన్నారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినందువల్ల వారు కుట్ర పన్నారన్నారు. ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పారు.

సంబల్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ బీ గంగాధర్ మాట్లాడుతూ, తాను ఓ నివేదికను పంపించానని, దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Pakistan Petrol Price: లీటర్ పెట్రోల్‌పై ఒకేసారి 22 రూపాయలు పెరిగింది.. పాక్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

KotamReddy: ఏపీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన కోటంరెడ్డి

Updated Date - 2023-02-16T14:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising