Odisha Cabinet Reshuffle: నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు
ABN, First Publish Date - 2023-05-22T11:22:44+05:30
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన మాజీ స్పీకర్ బిక్రమ్ కేశరి అరూఖా, రూర్కెలా ఎమ్మెల్యే సరద పి నాయక్, బంగిరిపోసి ఎమ్మెల్యే సుదామ్ మరాండీలతో గవర్నర్ గణేషి లాల్ ప్రమాణస్వీకారం చేయించారు.
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తన మంత్రివర్గాన్ని విస్తరించారు (Cabinet Reshuffle). కొత్తగా ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన మాజీ స్పీకర్ బిక్రమ్ కేశరి అరూఖా, రూర్కెలా ఎమ్మెల్యే సరద పి నాయక్, బంగిరిపోసి ఎమ్మెల్యే సుదామ్ మరాండీలతో గవర్నర్ గణేషి లాల్ ప్రమాణస్వీకారం చేయించారు. భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రిగా వరుసగా ఐదోసారి పదవిలో కొనసాగుతున్న పట్నాయక్ ఈ టర్మ్‌లో మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి.
ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, గత జనవరిలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నాబా కిషోరి దాస్ హత్యకు గురికావడంతో తాజా మంత్రివర్గ విస్తరణ అనివార్యమైంది. వ్యక్తిగత కారణాల రీత్యా ఇద్దరు మంత్రులు గత వారంలో తమ పదవులకు రాజీనామా చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణతో ముఖ్యమంత్రితో సహా ఒడిశా క్యాబినెట్‌లో 22 మంది మంత్రులు ఉన్నారు.
Updated Date - 2023-05-22T11:23:44+05:30 IST