Konark Wheel : అమెరికా టైమ్స్ స్క్వేర్‌లో కోణార్క్ చక్రం.. వికాస్ ఖన్నాను ప్రశంసించిన ఒడిశా సీఎం పట్నాయక్..
ABN, First Publish Date - 2023-08-17T16:03:09+05:30
కోణార్క్ వీల్‌ను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన మిషెలిన్ స్టార్డ్ చెఫ్, ఎంటర్‌ప్రైజింగ్ ఎంటర్‌ప్రెన్యూవర్ వికాస్ ఖన్నాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఒడిశాకు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో కోణార్క్ చక్రం ఒకటి అనే విషయం తెలిసిందే.
భువనేశ్వర్ : కోణార్క్ వీల్‌ను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన మిషెలిన్ స్టార్డ్ చెఫ్, ఎంటర్‌ప్రైజింగ్ ఎంటర్‌ప్రెన్యూవర్ వికాస్ ఖన్నాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఒడిశాకు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో కోణార్క్ చక్రం ఒకటి అనే విషయం తెలిసిందే. దీనిని భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మంగళవారం వికాస్ ఆవిష్కరించారు.
కోణార్క్ వీల్ నమూనాను టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించినట్లు గుర్తించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని ప్రకటించారు. దీనిని ప్రతిష్ఠించిన వికాస్ ఖన్నా (Vikas Khanna)ను ప్రశంసించారు.
‘‘భారత దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా న్యూయార్క్, టైమ్స్ స్క్వేర్ వద్ద కోణార్క్ దేవాలయ చక్రం నమూనాను ప్రతిష్టించినందుకు ఎంటర్‌ప్రెన్యూవర్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నాకు అభినందనలు. ఒడిశాకు చెందిన శాశ్వత శిల్ప నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినందుకు ధన్యవాదాలు, అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించిన కళాకారులకు ప్రశంసలు’’ అని నవీన్ పట్నాయక్ తెలిపారు.
టైమ్స్ స్క్వేర్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ కోణార్క్ చక్రం నమూనాను ఖన్నా ఆవిష్కరించారు. దీనిని భారతీయ మూలాలు కలవారు సందర్శించారు. దీనిని న్యూయార్క్ సిటీలో ఖన్నా ప్రారంభించే రెస్టారెంట్‌కు మార్చుతారు. భారతీయ మూలాలుగలవారు, యువతరం భారత దేశం నుంచి వచ్చిన చాలా స్వచ్ఛమైన, సొగసైనదానిని చూసి చాలా సంతోషిస్తారని వికాస్ తెలిపారు.
వికాస్ ఖన్నా స్వస్థలం అమృత్‌సర్. ఆయన వంటకాల్లో అద్భుతమైన కీర్తి ప్రతిష్ఠలను సంపాదించారు. మాస్టర్‌చెఫ్ ఇండియా అనే టెలివిజన్ సిరీస్‌కు ఆయన జడ్జిగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి :
Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..
Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?
Updated Date - 2023-08-17T16:03:09+05:30 IST