ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-11-14T17:02:54+05:30

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi pollution) తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌ (Jaipur)కు తాత్కాలికంగా మకాం మార్చారు. వాయునాణ్యత కలిగిన ప్రాంతానికి తాత్కాలికంగా వెళ్లాలని వైద్యులు సూచించారు.


ఢిల్లీలో మంగళవారంనాడు వాతావరణ నాణ్యతా సూచీ 375కు చేరింది. ఇది తీవ్రమైన కేటగిరిగా పరిగణిస్తారు. ఇదే నాణ్యతా సూచీ జైపూర్‌లో 72గా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి జైపూర్ వెళ్లి అక్కడి నుంచి బుధవారంనాడు ఛత్తీస్‌గఢ్ వెళ్తారు.


సోనియాగాంధీ గత సెప్టెంబర్‌లో ఫీవర్ లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజు డిశ్చార్జి అయ్యారు. శ్వాససంబంధిత సమస్యలతో గత జనవరిలో కూడా ఇదే ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా సిటీని విడిచి తాత్కాలికంగా బయట ప్రాంతాలకు సోనియాగాంధీ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. 2020 శీతాకాలంలో కూడా ఆమె వైద్యుల సలహా మేరకు గోవా వెళ్లారు.

Updated Date - 2023-11-14T17:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising