RSS chief Mohan Bhagwat : మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-15T13:03:38+05:30
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు....
అహ్మదాబాద్ (గుజరాత్): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.(RSS chief Mohan Bhagwat)ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క ఆలోచన దేశాన్ని విచ్ఛిన్నం చేయదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అనేక రకాల ఆలోచనలు,వ్యవస్థలతోనే ఒక దేశం(Country) అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారు. రాజ్‌రంత్న పురస్కార్ సమితి నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’’ అనే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రకటన చేశారు. ప్రతి నెలా ఎన్నికలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, జమిలి ఎన్నికల వల్ల ఓటర్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని గతంలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.మోహన్ భగవత్ భాగల్ పూర్ పర్యటన సందర్భంగా ఇటీవల ఆయనకు ఐఎస్ఐ, నక్సలైట్ల నుంచి బెదిరింపు వచ్చిందని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ చెప్పారు.
Updated Date - 2023-02-15T13:10:58+05:30 IST