ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

One thousand rupees: నేటి నుంచి ఇల్లాలికి నెలనెలా వెయ్యి రూపాయలు

ABN, First Publish Date - 2023-09-15T06:34:16+05:30

మహిళాభ్యుదయానికి అగ్రతాంబూలం ఇస్తున్న డీఎంకే ప్రభుత్వం ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా గృహిణులకు

- కంచిలో సీఎం స్టాలిన్‌ శ్రీకారం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మహిళాభ్యుదయానికి అగ్రతాంబూలం ఇస్తున్న డీఎంకే ప్రభుత్వం ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా గృహిణులకు ప్రతినెలా రూ.1000 వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే ‘కలైంజర్‌ మహిళా సాధికారిక పథకానికి’ శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కోటిమందికి పైగా మహిళలు లబ్ధి పొందనున్నారు. ఆలయాల నగరం కాంచీపురంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కంచిలోని పచ్చయప్పన్‌ బాలుర కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ లబ్ధిదారుల్లో కొంతమంది గృహిణులకు ప్రత్యేక ఏటీఎం కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లను కూడా కేటాయించింది. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.63 కోట్ల మంది గృహిణులు దరఖాస్తు చేసుకోగా వారిలో కోటి 6 లక్షల 50 వేల మందిని ఎంపిక చేశారు. వీరందరి బ్యాంక్‌ ఖాతాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని వారి ఖాతాలకు అధికారులు రూపాయి జమ చేసి, పరిశీలించారు. ఇలా పకడ్బందీ ఏర్పాట్లతో ఈ పథకం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది.

కంచిలో భారీ ఏర్పాట్లు...

కలైంజర్‌ మహిళా సాధికారిక పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) శుక్రవారం ఉదయం బయలుదేరి కంచి వెళ్తున్నారు. కాంచీపురంలోని పచ్చయప్పన్‌ బాలుర కళాశాల క్రీడా మైదానంలో ఉదయం పది గంటలకు జరిగే సభలో స్టాలిన్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా కాంచీపురంలోని ఆయన నివాసగృహానికి వెళ్ళి అక్కడున్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఉదయం పది గంటలకు సభా వేదిక ప్రాంతానికి చేరుకుని మహిళా సాధికార పథకాన్ని ప్రారంభిస్తూ కొందరు మహిళలకు ప్రత్యేక ఏటీఎం కార్డులను అందజేయనున్నారు. ఈ సభకు పదివేలమందికి పైగా లబ్ధిదారులైన గృహిణులకు తరలించేందుకు డీఎంకే స్థానిక నాయకులు తగు సన్నాహాలు చేపడుతున్నారు. స్ఠాలిన్‌ ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్ల సమక్షంలో గృహిణులకు ఏటీఎం కార్డులను అందజేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ పథకం కింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లబ్ధిదారులైన కొంతమంది గృహిణుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.1000 జమ అవడం విశేషం. ఒకేరోజున కోటిమందికి పైగా లబ్ధిదారులకు నగదు జమ చేయడంలో సమస్యలు వస్తాయని భావించి ముందు జాగ్రత్తగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-15T06:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising