Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయి... ఉల్లి కిలో రూ.110
ABN, First Publish Date - 2023-11-26T08:53:08+05:30
స్థానిక కోయంబేడు మార్కెట్‌లో చిన్న ఉల్లి(Onions) ధర కిలో రూ.110కి చేరుకుంది. అక్టోబరులో రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయమైన చిన్న
ఐసిఎఫ్(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్‌లో చిన్న ఉల్లి(Onions) ధర కిలో రూ.110కి చేరుకుంది. అక్టోబరులో రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయమైన చిన్న ఉల్లి ధర పెరుగుతూ వచ్చింది. గత నెలలో గరిష్ఠంగా రూ.150 వరకు విక్రయమైన చిన్న ఉల్లి ఈనెల ప్రారంభంలో కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలికాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు దిగుమతులు తగ్గడంతో హఠాత్తుగా శుక్రవారం కిలో రూ.100 నుంచి రూ.110 వరకు ధర పెరిగింది. చిల్లర విక్రయ దుకాణాలలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. ఇతర కూరగాయల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు హెచ్చు తగ్గులున్నాయి.
Updated Date - 2023-11-26T08:53:10+05:30 IST