ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Operation Kaveri: ‘ఆపరేషన్‌ కావేరి’కి అన్నివిధాలా సహకరిస్తాం

ABN, First Publish Date - 2023-04-27T07:30:49+05:30

సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా స్వదేశానికి రాలేక అవస్థలు పడుతున్న భారతీయులను తరలించేందుకు కేంద్రప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా స్వదేశానికి రాలేక అవస్థలు పడుతున్న భారతీయులను తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఆపరేషన్‌ కావేరి పేరుతో తీసుకుంటున్న చర్యలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) లేఖ రాశారు. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది తమిళులు కూడా స్వస్థలాలకు తిరిగిరాలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని కూడా ఆపరేషన్‌ కావేరి(Operation Kaveri) ద్వారా విమానాల్లోనో, నౌకలలోనూ స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సూడాన్‌లో అలమటిస్తున్న తమిళుల వివరాలను తమ ప్రభుత్వం సేకరిస్తోందని, వారి స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం కలిసి సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సూడాన్‌లోని భారతీయులందరినీ స్వదేశానికి తరలించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమ ప్రభుత్వం గట్టి మద్దతు ఇవ్వడమే కాకుండా సహాయక చర్యలలో పాలుపంచుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని స్టాలిన్‌ ఆ లేఖలో ప్రధాని మోదీకి వివరించారు.

Updated Date - 2023-04-27T07:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising