ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Opposition MPs: ఆవేదన వినటానికే వచ్చాం!

ABN, First Publish Date - 2023-07-30T03:23:46+05:30

మూడు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్షాల(Opposition )కు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌(Imphal)కు చేరుకుంది.

మణిపూర్‌లో విపక్ష ఎంపీలు.. బాధితుల శిబిరాల సందర్శన

ఇదంతా ప్రచారం కోసమే: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

మైతేయీలతో కలిసి ఉండలేం.. మాకు విడిగా పాలన కావాలి

‘ఇండియా’ మద్దతు కోరుతూ గిరిజన నేతల లేఖ

మణిపూర్‌ను విభజించవద్దంటూ రాజధానిలో భారీ ర్యాలీ

నగ్న వీడియో ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

మణిపూర్‌లో విపక్ష ఎంపీలు

బాధితుల శిబిరాల సందర్శన

ఇంఫాల్‌/ న్యూఢిల్లీ, జూలై 29: మూడు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్షాల(Opposition )కు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌(Imphal)కు చేరుకుంది. తాజాగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న చురాచంద్‌పూర్‌(Churachandpur)ను తొలిరోజున ఎంపీలు సందర్శించారు. రెండు శిబిరాల్లో ఉన్న కుకీ బాధితులను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్‌(Congress ) లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి(Adhir Ranjan Chaudhary) మీడియాతో మాట్లాడుతూ, ‘తమపై జరిగిన దారుణ అకృత్యాలను బాధితులు మాకు తెలియజేశారు. వీటన్నింటినీ పార్లమెంటులో లేవనెత్తుతాం‘ అని తెలిపారు. బిష్ణుపూర్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కుకీ బాధితులున్న శిబిరాలను కూడా ఎంపీలు సందర్శించారు. విపక్ష ఎంపీల మణిపూర్‌ పర్యటన ప్రచారం కోసమేనని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) విమర్శించారు. మరోవైపు, మయన్మార్‌ నుంచి అక్రమంగా వలస వచ్చి రాష్ట్రంలో నివాసం ఉంటున్న కాందిశీకుల బయోమెట్రిక్‌ వివరాలను సేకరించటం ప్రారంభించామని రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. సెప్టెంబర్‌ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

వారి మృతదేహాలనైనా చూపించండి

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేయగా, ఆ ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ తీసుకుంది. ఇద్దరు బాధిత మహిళల్లో ఒక మహిళ తల్లిని ఎంపీలు సుస్మితాదేవ్‌, కనిమొళి కలిసి మాట్లాడారు. తన బిడ్డను దారుణంగా అవమానించి ఆమెపై అత్యాచారం జరిపారని, తన భర్తను, కుమారుడిని చంపేశారని, ఇదంతా పోలీసుల ముందే జరిగిందని ఆమె వాపోయారు. కనీసం వారి మృతదేహాలనైనా చూపించటంలో సహాయం చేయమని అర్థించారు. ఆమె భర్త సైన్యంలో పని చేసి దేశాన్ని రక్షించారుగానీ, తన ప్రాణాల్ని, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారని కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు.


మా డిమాండ్లకు మద్దతివ్వండి

ఎంపీల పర్యటన నేపథ్యంలో మణిపూర్‌కు చెందిన ‘మూలవాసీ గిరిజన నేతల ఫోరం’ (ఐటీఎల్‌ఎఫ్‌) విపక్ష కూటమి ‘ఇండియా’ను ఉద్దేశించి ఒక లేఖ రాసింది. హింసాకాండలో ఇరువర్గాలూ ప్రభావితమైనప్పటికీ, మూడింట రెండొంతుల మేర నష్టపోయింది తామేనని లేఖలో వారు తెలిపారు. ఇప్పటి వరకూ 119 మంది మరణించారని వీరిలో అత్యధికులు సాధారణ పౌరులేనని, 359 చర్చిలను, ఏడు వేలకుపైగా ఇళ్లను మైతేయీలు కాల్చివేశారని, 40 వేల మందికిపైగా గిరిజనులు స్వస్థలాల నుంచి దూరమయ్యారని పేర్కొన్నారు. మైతేయీలు, గిరిజనులు భౌతికంగా పూర్తిగా దూరమైన ఈ తరుణంలో మైతేయీల ఆధిపత్యంలోని మణిపూర్‌ ప్రభుత్వం కింద తాము ఉండటం సాధ్యం కాబోదని, తమ ప్రాంతాలకు ప్రత్యేక పాలనాయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఈ డిమాండ్లకు ఇండియా మద్దతు తెలుపాలని కోరారు. మరోవైపు, గిరిజన తెగలకు ప్రత్యేక పాలన యంత్రాంగం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా ఇంఫాల్‌లో శనివారం భారీ ర్యాలీ జరిగింది. ‘మణిపూర్‌ సమగ్రత సమన్వయ కమిటీ’ ఆధ్వర్యంలో ఇది జరిగింది.

సెప్టెంబరులో ‘ఇండియా’ మూడో భేటీ

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మూడో సమావేశం సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీ ఆగస్టు 25, 26 తేదీల్లో ముంబైలో జరుగుతుందని భావించారు. కానీ, పలువురు నేతలు ఆ తేదీల్లో వీలు కావటం లేదని చెప్పినట్లు సమాచారం. ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలో ఈ భేటీ జరుగనుంది.

Updated Date - 2023-07-30T04:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising