ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: ఢిల్లీ పరిధిలో పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న 80కిపైగా రైళ్లు, విమానాలు

ABN, Publish Date - Dec 30 , 2023 | 10:34 AM

ఢిల్లీని పొగమంచు(Fog) వణికిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఢిల్లీ: ఢిల్లీని పొగమంచు(Fog) వణికిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది.

"పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లకు హై అలర్ట్. డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది" అని ఐఎండీ ఎక్స్‌(X)లో పోస్ట్ చేసింది. రైళ్లు, విమానాలను రద్దు చేయడమే కాకుండా కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.30 వరకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో 80కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కఠినమైన పరిస్థితులనడుమే రాజధానిలోని కర్తవ్య మార్గంలో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Updated Date - Dec 30 , 2023 | 10:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising