ISI Agent : పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఉత్తర ప్రదేశ్‌లో అరెస్ట్
ABN, First Publish Date - 2023-08-18T11:37:48+05:30
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందజేస్తున్న వ్యక్తిని ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేశారు. భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం యువతను ఈ వ్యక్తి ప్రేరేపిస్తున్నట్లు కూడా వెల్లడైంది.
న్యూఢిల్లీ : పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందజేస్తున్న వ్యక్తిని ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేశారు. భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం యువతను ఈ వ్యక్తి ప్రేరేపిస్తున్నట్లు కూడా వెల్లడైంది. భారత్‌లో జీహాద్‌ను వ్యాపింపజేసి, మతపరమైన అల్లర్లను సృష్టించడం ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఆయన పని చేస్తున్నట్లు బయటపడింది. దేశంలోని భద్రతా సంస్థల వద్ద ఈ వ్యక్తి రెక్కీ చేసినట్లు వెల్లడైంది.
ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ కలీం అహ్మద్‌ను మీరట్‌లో అరెస్టు చేశారు. భారత దేశ సార్వభౌమాధికారం, ఐకమత్యం, సమగ్రత, సామాజిక సామరస్యాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో భారీ దాడులకు పాల్పడటానికి ఈ వ్యక్తి ప్రణాళికలు రచిస్తున్నాడు. భారత దేశంలో భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు, సంస్థల వివరాలను ఫొటోలు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా పాకిస్థాన్ ఐఎస్ఐకి, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థలకు పంపించాడు.
నాలుగైదు రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చిన కలీం అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి కార్యకలాపాల గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఆయనను అరెస్టు చేయగలిగారు. కలీం సోదరుడు తెహసీన్ వురపు తసీమ్ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాను తన బంధువులను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లానని, పాకిస్థానీ ఐఎస్ఐ అధికారులను కలిశానని పోలీసులకు కలీం చెప్పాడు. భారత దేశంలో పేలుళ్లు, దాడులు జరిపేందుకు నిధులు సమకూర్చుతామని ఐఎస్ఐ అధికారులు తనకు చెప్పారని తెలిపాడు. భారత దేశాన్ని ఇస్లామిక రాజ్యంగా మార్చడానికి, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి పని చేయాలని తనను కోరారని చెప్పాడు.
భారత దేశం ఇటీవల సమకూర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాలను, ఇతర ముఖ్యమైన భద్రతా సంస్థల వివరాలను తాను ఐఎస్ఐ అధికారులకు, ఇతర హ్యాండ్లర్స్‌కు వాట్సాప్ ద్వారా పంపించానని చెప్పాడు.
ఇవి కూడా చదవండి :
Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..
Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..
Updated Date - 2023-08-18T11:37:48+05:30 IST