Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..
ABN, First Publish Date - 2023-07-05T10:39:52+05:30
ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్‌లో ఖురాన్‌ను అవమానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా యవుమ్-ఈ-తకద్దుస్-ఈ-ఖురాన్ నిర్వహించాలని, గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇస్లామాబాద్ : ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్‌లో ఖురాన్‌ను అవమానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా యవుమ్-ఈ-తకద్దుస్-ఈ-ఖురాన్ నిర్వహించాలని, గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఖురాన్‌కు జరిగిన అవమానంపై నిరసన తెలిపే కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలను ప్రభుత్వం కోరింది. ఖురాన్‌కు సంబంధించిన జాతీయ విధానాన్ని రూపొందించేందుకు గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రజాభిప్రాయాన్ని పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఖురాన్‌కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశాల్లో ఓ తీర్మానం చేయబోతున్నట్లు వివరించింది.
దేశవ్యాప్తంగా జరిగే ర్యాలీల్లో పాల్గొనాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖురాన్‌పై విశ్వాసమే ముస్లింలందరినీ ఏకం చేస్తుందన్నారు. తప్పుడు ఆలోచనలుగలవారు ఇస్లామోఫోబియాను రాజేయడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి, సహజీవనాలకు విలువనిచ్చే దేశాలు, నేతలు ఇటువంటి విధ్వంసక శక్తులను అణచివేయాలన్నారు.
ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో ఓ వ్యక్తి ఖురాన్‌ను అవమానించారు. ఈ సంఘటనను స్వీడన్ సహా పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, మొరాకో, ఇరాక్, ఇరాన్ ఖండించాయి.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు
Updated Date - 2023-07-05T10:39:52+05:30 IST