Hardeep Singh Nijjar: భారత్- కెనడా మధ్య చిచ్చుకు పాకిస్థాన్ కుట్ర?
ABN, First Publish Date - 2023-09-27T13:16:24+05:30
భారత్ - కెనడాల(India - Canada) మధ్య ఖలిస్థానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు రోజు రోజుకీ నివురుగప్పిన నిప్పులా మారుతోంది. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన తాజా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. అందులోని వివరాల ప్రకారం.. భారత్, కెనడాల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నింది.
ఢిల్లీ: భారత్ - కెనడాల(India - Canada) మధ్య ఖలిస్థానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు రోజు రోజుకీ నివురుగప్పిన నిప్పులా మారుతోంది. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన తాజా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. అందులోని వివరాల ప్రకారం.. భారత్, కెనడాల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నింది. చాలా నెలల క్రితమే ఈ కుట్రకు సంబంధించి బ్లూ ప్రింట్ రెడీ చేసి హర్దీప్ హత్యకు ప్లాన్ వేసింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar)ను హతమార్చేందుకు భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
నిజ్జర్‌ను చంపడానికి ఐఎస్ఐ నేరస్థులను నియమించిందని, రెండేళ్లలో కెనడాకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌లకు మద్దతు ఇవ్వమని హర్దీప్ పై ఒత్తిడి తెచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. అయితే నిజ్జర్ మాత్రం మాజీ ఖలిస్థానీయుల వైపే నిలిచారు. దీంతో అతడ్ని హత్య చేసి ఆ స్థానంలోకి ఐఎస్ఐ వెళ్లబోతోందని, కెనడాలో ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులను సమీకరించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. తరువాత భారత్ ఆ వాదనను ఖండించినా వివాదం మాత్రం సద్దుమణగలేదు.
Updated Date - 2023-09-27T13:17:42+05:30 IST