ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat Express: వందేభారత్ రైలులోని ఫుడ్‌లో బొద్దింక.. రైల్వే సమాధానం ఏమిటంటే?

ABN, First Publish Date - 2023-07-27T21:57:18+05:30

రైల్వే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే...

రైల్వే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. అయినా సరే.. మార్పు మాత్రం రావడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ఇది రిపీట్ అయ్యింది. ఒక ప్యాసింజర్ ఫుడ్‌లో బొద్దింక కనిపించింది. దీంతో అతడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సుబోధ్ పహలాజన్ అనే ప్యాసింజర్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరాడు. దూరప్రయాణం కాబట్టి.. మార్గమధ్యంలో ఆకలేసి, ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ రాగానే.. ఇక కడుపునిండా తినేయాలని అనుకున్నాడు. కానీ.. ప్యాకెట్ ఓపెన్ చేయగానే, అతడు ఖంగు తిన్నాడు. ఒక చపాతిలో బొద్దింక కనిపించడంతో షాకైన అతగాడు.. వెంటనే ఆ ఫోటోలు తీశాడు. అనంతరం వాటిని ట్విటర్‌లో పోస్ట్ చేసి.. రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఐఆర్‌సీటీసీని ట్యాగ్ చేస్తూ.. తన ఫుడ్‌లో బొద్దింక వచ్చిందని, ఏంటీ నిర్లక్ష్యమని అడిగాడు.


ఈ ట్వీట్‌కు రైల్వే సేవ వెంటనే స్పందించింది. మీకు ఎదురైన ఈ చేదు అనుభవానికి చింతిస్తున్నామని, తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ఇదే అదునుగా భావించి.. ఇతర ప్యాసింజర్లు సైతం ఫుడ్ విషయంలో తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. వాళ్లందరికీ బదులిస్తూ.. సమస్యల్ని పరిష్కరిస్తామంటూ రైల్వే సేవ హామీ ఇచ్చింది.

Updated Date - 2023-07-27T22:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising