ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chhattisgarh Elections: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. తేల్చి చెప్పిన పీపుల్ పల్స్ సర్వే.. గతంలో కన్నా ఎక్కువే!

ABN, First Publish Date - 2023-11-04T16:23:59+05:30

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నవంబర్‌లో రెండు విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేస్తుందని పీపుల్ పల్స్ సర్వే...

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నవంబర్‌లో రెండు విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేస్తుందని పీపుల్ పల్స్ సర్వే తేల్చి చెప్పింది. 2018 ఎన్నికలతో పోలిస్తే.. కాంగ్రెస్‌కు ఈసారి ఓట్లు, స్థానాలు అధికంగా దక్కే అవకాశం ఉందని కూడా ఆ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో ఆ రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండటం.. బీజేపీలోని అంతర్గత కలహాలతో పాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సరైన వ్యూహాలు రచించడంలో ఆ పార్టీ విఫలం అవ్వడం.. వంటి అంశాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయని తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలో రావడాన్ని ఎవ్వరూ ఆపలేరని వెల్లడించింది.


నవంబర్ 7, 17వ తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 60 స్థానాలు సొంతం చేసుకొని, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పీపుల్ పల్స్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే స్పష్టం చేసింది. ఇక బీజేపీకి 29-34 స్థానాలు.. బీఎస్పీతో పాటు ఇండిపెండెంట్లు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని ఆ సర్వే పేర్కొంది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. ఆ ఫిగర్‌ని కాంగ్రెస్ సునాయాసంగా దాటేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయని సర్వే తెలుపుతోంది. ఇక ఓట్ల శాతం విషయానికొస్తే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు నమోదు అవ్వగా, ఈసారి ఆ సంఖ్య 47కి పెరుగుతుందని తెలిపింది. అలాగే.. గత ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి 42% ఓట్లు పొందే అవకాశముందని చెప్పింది. ఇతరులకు 11 శాతం ఓట్లు పడనున్నట్టు చెప్పుకొచ్చింది.

కాగా.. పీపుల్ పల్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ఛత్తీస్‌గఢ్‌లో అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 90 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి ప్రాధాన్యమిస్తూ.. మొత్తం 6,120 శాంపిల్స్‌ని సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం.. ఛత్తీస్‌గఢ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ మంచి పనితీరు కనబర్చి భూపేష్ జనాకర్షణ నేతగా ఎదగడం.. బీజేపీ నుంచి సరైన ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం.. వంటి ఫ్యాక్టర్స్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అతిపెద్ద పాజిటివ్ పాయింట్స్ మారుతాయని ఆ సర్వే సంస్థ వివరణ ఇచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారం మాత్రం కాంగ్రెస్‌దేనని వెల్లడించింది. మరి.. ఈ సర్వే చెప్పిన జోష్యం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి.

Updated Date - 2023-11-04T16:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising