Supreme Court : బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు..
ABN, First Publish Date - 2023-11-07T11:31:09+05:30
దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు నమోదయ్యాయి. రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు గత తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
ఢిల్లీ : దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు నమోదయ్యాయి. రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు గత తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలన్నారు. గతంలో ఇచ్చిన తీర్పును దేశమంతటా అమలు చేయాలన్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లోనైనా బాణసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని పిటిషనర్ పేర్కొన్నారు. కాలుష్యం స్థాయుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉందని.. ప్రతి వ్యక్తి టపాసులు వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.
ఈ రోజుల్లో పిల్లలు కాల్చడం లేదని.. పెద్దలే బాణాసంచా ఎక్కువగా కాల్చుతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. పర్యావరణానికి హాని కల్గించే అంశాలపై కేవలం కోర్టులకు మాత్రమే బాధ్యత ఉందన్న తప్పుడు భావన ప్రజల్లో ఉందని తెలిపింది. దీనిపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. వాయు కాలుష్యంపై తామిచ్చిన ఆదేశాలను రాజస్థాన్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం సూచించింది. పండుగ వేళల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంతకు మించి ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని.. ప్రజలకు అవగాహన కల్గించడమే ఇక్కడ ముఖ్యమని ధర్మాసనం తెలిపింది.
Updated Date - 2023-11-07T11:31:11+05:30 IST