ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మోదీ

ABN, First Publish Date - 2023-02-07T14:37:21+05:30

మనోజ్ తివారీ మాట్లాడుతూ, బీజేపీ (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులో జరిగిందని,

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంటులో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari) ఈ వివరాలను వెల్లడించారు.

మనోజ్ తివారీ మాట్లాడుతూ, బీజేపీ (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులో జరిగిందని, టర్కీ, సిరియాలలో భూకంపాల వల్ల జరిగిన విధ్వంసం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమకు వివరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీటిపర్యంతమయ్యారని తెలిపారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపాన్ని, ఆనాటి విధ్వంసాన్ని, ప్రజల కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారని చెప్పారు. గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కారణంతో టర్కీ ప్రజల కష్టాలను మోదీ అర్థం చేసుకోగలరన్నారు.

టర్కీ, సిరియాలను సోమవారం, మంగళవారం వరుస భూకంపాలు కుదిపేశాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సహాయాన్ని పంపిస్తున్నాయి. మన దేశం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్, మందులు, పరికరాలు వంటి వాటిని పంపించింది. ఈ సహాయం మంగళవారం మధ్యాహ్నానికి టర్కీ (Turkey) చేరుకుంది.

Updated Date - 2023-02-07T14:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising