ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi: హైదరాబాద్ పర్యటన ముగించుకుని చెన్నైకు బయలుదేరిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-04-08T14:16:29+05:30

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరిగి చెన్నై (Chennai)కు బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరిగి చెన్నై (Chennai)కు బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని శనివారం మధ్యాహ్నం చెన్నైకి విచ్చేస్తున్నారు. అయితే మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతాధికారులు స్వల్ప మార్పులు చేశారు. చెన్నైలో ఆయన నాలుగుచోట్ల జరిగే కార్యక్రమాలలో పాల్గొనున్నారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ (Central Railway Station), మైలాపూరు శ్రీరామకృష్ణమఠం, పల్లావరం సైనిక మైదానంలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. నిర్దేశిత పర్యటన వివరాల మేరకు ఆయన మైలాపూరు శ్రీరామకృష్ణమఠంలో ఆ మఠం 125వ వార్షికోత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ మఠానికి వెళ్లే దారి ఇరుకుగాను, వేడుకలు జరిగే ప్రాంతం విస్తీర్ణం కూడా తక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మోదీ ఆ మఠం సందర్శనను రద్దు చేశారు. అదే సమయంలో శ్రీరామకృష్ణమఠం వేడుకలను మెరీనాబీచ్‌ (Marina Beach)లో ఆ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకానందర్‌ ఇల్లమ్‌లో జరుపనున్నారు. ఆ మేరకు ప్రధాని మోదీ తొలుత సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో చెన్నై - కోయంబత్తూరు వందేభారత్‌ రైలు(Chennai - Coimbatore Vandebharat Train) సర్వీసును ప్రారంభించిన తర్వాత అక్కడి నుండి నేరుగా వివేకానందర్‌ ఇల్లమ్‌ చేరుకుని అక్కడ జరిగే శ్రీరామకృష్ణమఠం 125వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. కాగా ప్రధాని మోదీ చెన్నై పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసును ప్రస్తావించారు. చేసిన అవినీతి నుంచి తమను కాపాడాలంటా కొందరు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించిందన్నారు. కుటుంబ, అవినీతి పాలన తెలంగాణకు ఆటంకంగా మారిందని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనను తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కుటుంబ, అవినీతి పాలన.. పనిచేసేవారికి ఇబ్బందికరంగా మారిందని, కేంద్ర ప్రాజక్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదన్నారు.

కేంద్ర పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రధాని మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో టెక్స్ టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, నూతన ప్రాజక్టుల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. తొమ్మిదేళ్ళుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-08T14:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising