NDA Meet: ప్రతి పక్షాల ఇండియాపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు
ABN, First Publish Date - 2023-07-18T21:20:21+05:30
వచ్చే 25 ఏళ్లలో ఎన్డీఏ (NDA) దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modi) అన్నారు.
ఢిల్లీ: వ్యతిరేకతపై రూపొందించిన కూటములు ఎప్పటికీ గెలవబోవని ప్రతి పక్షాల ఇండియా (I.N.D.I.A) కూటమిని ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి చేశారు. కూటమి కుటుంబ, అవినీతిపరమైనప్పుడు దేశం నష్టపోతుందని అన్నారు. ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ పేదలు, వెనుకబడిన వర్గాలతో కూడిన భారత్ ఎన్డీయేతో ఉందన్నారు. ఎన్డీయే భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే 25 ఏళ్లలో ఎన్డీఏ (NDA) దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modi) అన్నారు.
"దేశంలో స్థిరమైన పాలన అందించడానికే ఎన్డీఏ కూటమి. అద్వానీయే ఎన్డీఏకు మార్గదర్శకులు. ఎన్డీఏను నిర్మించింది వాజ్‌పేయ్, అద్వానీయే. కూటమిలోకి కొత్త మిత్రులకు స్వాగతం. ఎన్డీఏ పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం ఉంది. దేశ ప్రగతిలో ఎన్టీఏ పాత్ర అత్యంత కీలకం. దేశంలో ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడు సఫలం కాలేదు. కాంగ్రెస్ కూటమి ప్రజావ్యతిరేక కూటమి. ఆత్మనిర్భర్, భారత్ పురోభివృద్ధి లక్ష్య సాకారానికి కృషి. దేశ ప్రజలు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ. N- న్యూ ఇండియా, D- డెలవప్‌నేషన్, A- యాస్పిరేషన్ ఆఫ్ పీపుల్. అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది. అందరి కృషి వల్లే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది." అని మోదీ అన్నారు.
"ఎన్డీఏ హయాంలో 13.5 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు పైకి వచ్చారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏది. విపక్ష పార్టీలు నన్ను నీచుడు అని నిందిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తుంది. ఎన్డీఏ కూటమిలో చిన్న, పెద్ద పార్టీలంటూ తేడా ఏం లేదు. గాంధీ, అంబేద్కర్, లోహియా సిద్ధాంతాలను ఎన్డీఏ ఆచరిస్తుంది. ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ఎన్డీఏది. అవినీతిని అంతం చేసేందుకు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నాం. మేకిన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సమిష్టి కృషితోనే ప్రభుత్వాలు ఏర్పాడుతాయి. వంశపారంపర్య, అవినీతి పార్టీల కూటమితో దేశానికి నష్టం. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కాలేదు. మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. స్థిరమైన ప్రభుత్వం వల్లే ప్రపంచానికి మనపై నమ్మకం పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేశాం. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం. దేశ ప్రగతి నినాదంతోనే ఎన్డీఏ ముందుకు వెళ్తోంది. భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నాం. దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. దేశ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే మా అజెండా. దేశప్రగతి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నాం. నవ భారత నిర్మాణం ఎన్డీఏ లక్ష్యం. దేశం తలవంచుకునే పనులు ఎన్డీఏ ఎప్పుడూ చేయదు. నిబద్ధతతో ప్రజలు తల ఎత్తుకునేలా పాలన సాగిస్తున్నాం." అని మోదీ వెల్లడించారు.
Updated Date - 2023-07-18T21:58:02+05:30 IST