ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madan Mohan Malaviya book: పండిట్ మదన్ మోహన్ మాలవీయ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

ABN, Publish Date - Dec 25 , 2023 | 09:17 PM

బనారస్ హిందు యూనివర్శిటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ' ఫస్ట్ సిరీస్ పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: బనారస్ హిందు యూనివర్శిటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ (Pandit Madan Mohan Malaviya) 162వ జయంతి సందర్భంగా 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ' ఫస్ట్ సిరీస్ పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 వాల్యూమ్స్‌, 4,000 పైగా పేజీలతో ఆంగ్ల, హిందీ భాషల్లో ఈ పుస్తకం రూపొందింది. మాలవీయ రచనలు, దేశవ్యాప్తంగా ఆయన చేసిన ప్రసంగాల సంకలనం ఇది.


ఈ వాల్యూమ్స్‌లో ఏమున్నాయి?

-మాలవీయ ప్రచురితం కాని లేఖలు, ఆర్టికల్స్, ప్రసంగాలు, మెమొరాండంలు.

-1907లో ప్రారంభమైన హిందీ వీక్లీ 'అభ్యుదయ్'లో వచ్చిన ఎడిటోరియల్ కంటెంట్.

-ఎప్పటికప్పుడు మాలవీయ రాసిన ఆర్టికల్స్, పాంప్లెట్లు, బుక్‌లెట్స్

-1903, 1910 మధ్యకాలంలో ఆగ్రా, అవథ్ యునైటెడ్ ప్రావిన్సెస్‌ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాలవీయ చేసిన ప్రసంగాలు.

-రాయల్ కమిషన్ ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్లు

-1910, 1920 మధ్య ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు బిల్లుల సమర్పణ సందర్భంగా మాలవీయ చేసిన ప్రసంగాలు

-బనారస్ హిందూ యూనివర్శిటీ ఏర్పడకు ముందు, ఆ తరువాత మాలవీయ రాసిన ఉత్తరాలు, రచనలు, ప్రసంగాలు, 1923 నుంచి 1925 మధ్య ఆయన రాసిన డైరీ.

-ప్రముఖ పాత్రికేయుడు శ్రీ రామ్ బహదూర్ రాయ్ సారథ్యంలో మహమన మాలవీయ మిషన్ ఈ పుస్తకానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్, సంకలనం చేపట్టింది.

-కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పబ్లికేషన్ డివిజన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.


స్ఫూర్తి పండుగ: మోదీ

ఇండియా, ఇండియన్‌నెస్‌పై నమ్మకం ఉన్న ప్రజలకు ఈరోజు ఒక స్ఫూర్తి పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ అన్నారు. ఈరోజు మదన్ మోహన్ మాలవ్యతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి అని గుర్తు చేశారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ కంప్లీట్ బుక్ ఆవిష్కరణ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుందని, పండిట్‌జీ ఆదర్శాలు, ఆలోచనలు, జీవితం నేటి యువతరం, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 09:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising