ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi : జకార్తాలో గర్జించిన మోదీ.. చైనాకు చుక్కలే..

ABN, First Publish Date - 2023-09-07T20:20:43+05:30

సరిహద్దుల్లోని దేశాల భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ మ్యాపును విడుదల చేసిన చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుక్కలు చూపించారు. జకార్తాలో జరిగిన రెండు సమావేశాల్లో విస్పష్టమైన సందేశాన్ని పంపించారు.

న్యూఢిల్లీ : సరిహద్దుల్లోని దేశాల భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ మ్యాపును విడుదల చేసిన చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుక్కలు చూపించారు. జకార్తాలో జరిగిన రెండు సమావేశాల్లో విస్పష్టమైన సందేశాన్ని పంపించారు. కోవిడ్-19 మహమ్మారి అనంతరం ఆసియాన్ దేశాలకు నిబంధనల ఆధారిత వ్యవస్థ ఉండాలని చెప్పారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలు పటిష్టమయ్యేందుకు ఉమ్మడి కృషి అవసరమని చెప్పారు. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాలో గురువారం జరిగిన ఆసియాన్-భారత్ సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల్లో మోదీ మాట్లాడారు.

సరిహద్దుల్లోని దేశాల భూభాగాలను కలుపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన మ్యాపును భారత దేశంతోపాటు జపాన్, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, తైవాన్ వ్యతిరేకించాయి.

ఆసియాన్-భారత్ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ఈ కూటమిలోని పది దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెరగడానికి 12 అంశాలతో ఓ ప్రణాళికను ప్రతిపాదించారు. స్వేచ్ఛాయుతమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం, దక్షిణాది దేశాల గళాన్ని మరింత గట్టిగా వినిపించడంలో ఇరు పక్షాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 21వ శతాబ్దం ఆసియాదేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవ సంక్షేమం కోసం పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆయన హిందీలో మాట్లాడటం విశేషం.

చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ హాజరైన తూర్పు ఆసియా సదస్సులో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ చట్టాలకు సంపూర్ణంగా కట్టుబడి ఉండటం తప్పనిసరి అని తెలిపారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఉమ్మడిగా కృషి చేయాలని చెప్పారు. గతంలో తాను చెప్పినట్లుగా ఇది యుద్ధాలు చేసే కాలం కాదన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్యం మాత్రమే మార్గమని తెలిపారు. ఈ సదస్సులో కూడా ఆయన హిందీలోనే మాట్లాడారు.


ఇవి కూడా చదవండి :

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం

Updated Date - 2023-09-07T20:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising