ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Meet : భారత్‌లో అవినీతిని సహించని వ్యవస్థ : మోదీ

ABN, First Publish Date - 2023-08-12T14:22:32+05:30

భారత దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అవినీతి వల్ల ప్రజల జీవన నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు. అవినీతి ప్రభావం వనరుల వినియోగంపైన ఉంటుందన్నారు. మార్కెట్లను కుదిపేస్తుందని, సేవల బట్వాడాను ప్రభావితం చేస్తుందని తెలిపారు.

న్యూఢిల్లీ : భారత దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. అవినీతి వల్ల ప్రజల జీవన నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు. అవినీతి ప్రభావం వనరుల వినియోగంపైన ఉంటుందన్నారు. మార్కెట్లను కుదిపేస్తుందని, సేవల బట్వాడాను ప్రభావితం చేస్తుందని తెలిపారు. వీటన్నిటి వల్ల భారతీయులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని తెలిపారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ20 యాంటీ కరప్షన్ సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు.

‘‘అవినీతి నిర్మూలన కోసం పోరాడటం మా ప్రజల పట్ల మా పవిత్ర కర్తవ్యం’’ అని మోదీ తెలిపారు. కౌటిల్యుని అర్థ శాస్త్రాన్ని ప్రస్తావిస్తూ, గరిష్ఠ స్థాయి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ నిధులను పెంచడం ప్రభుత్వ కర్తవ్యమని చెప్పారు. సత్యం, చిత్తశుద్ధిలను దురాశ క్రమంగా క్షీణింపజేస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.


మరింత పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను సృష్టించేందుకు టెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ వ్యవస్థలను వృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల్లో లీకేజీలు, గ్యాప్‌లను అరికడుతున్నామని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ విధానంలో లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా సొమ్ము జమ అవుతోందన్నారు.

ప్రభుత్వం ఆయుధాలు, ఇతర యంత్రాలను కొనేటపుడు అవినీతి లేకుండా, జవాబుదారీతనం ఉండేలా ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పోర్టల్ చాలా పారదర్శకతను తీసుకొచ్చిందన్నారు. ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని 2018లో తీసుకొచ్చామని, ఆ తర్వాత ఆర్థిక నేరగాళ్లు, పరారైన వ్యక్తుల నుంచి 1.8 బిలియన్ డాలర్లకుపైగా రాబట్టినట్లు చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం 2014 నుంచి ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన 12 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.

జీ20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు కోల్‌కతాలో ఈ నెల 9న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు శనివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో జీ20 దేశాల మంత్రులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి :

UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ

Bharatiya Nyaya Sanhita : పెళ్లి పేరుతో మహిళను అనుభవించే దుష్టుడికి పదేళ్ల జైలు శిక్ష.. కేంద్రం ప్రతిపాదన..

Updated Date - 2023-08-12T14:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising