ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM MOdi: అంబులెన్స్‌కు దారిచ్చేందుకు కాన్వాయ్‌ను ఆపిన ప్రధాని

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:28 PM

రెండ్రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారంనాడు తన నియోజకవర్గంలో రోడ్‌షో సందర్భంగా ఒక అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను కొద్ది నిమిషాలు ఆపారు. దీంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా ముందుకు వెళ్లిపోయింది.

వారణాసి: రెండ్రోజుల పర్యటనలో భాగంగా వారణాసి (Varanasi)లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అదివారంనాడు తన నియోజకవర్గంలో రోడ్‌షో సందర్భంగా ఒక అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను కొద్ది నిమిషాలు ఆపారు. దీంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా ముందుకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వారణాసిలో రూ.19,000 కోట్లతో 37 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, కాశీ తమిళ సంగమం 2.0ని ప్రారంభించేందుకు ప్రధాని ఇక్కడకు వచ్చారు.


ఒక అంబులెన్స్ కోసం ప్రధాని తన కాన్వాయ్‌ను ఆపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అహ్మదాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. 2019లో ఒక కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఆ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్న ఒక కెమెరామెన్ కళ్లుతిరిగి పడిపోయాడు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, అంబులెన్స్ తెప్పించమంటూ అధికారులకు సూచనలు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 05:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising