ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Mega Roadshow: 37 కిలోమీటర్లు, 17 నియోజకవర్గాలు, 10 లక్షల మంది హాజరు..!

ABN, First Publish Date - 2023-05-03T18:07:14+05:30

క్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ బీజేపీ పతాకం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ బీజేపీ (BJP) పతాకం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ తుదిపోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను (Karnataka Assembly Elections) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సుడిగాలి పర్యటనలతో హెరెత్తిస్తుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అలుపెరుగని రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈనెల 6వ తేదీ శనివారంనాడు 'నభూతో నభవిష్యత్తి' అనే రీతిలో మోదీ మెగా రోడ్‌షో జరుపబోతున్నారు.

ఒకేరోజులో 8 గంటలు, రెండు విడతలు

కర్ణాటక ఎన్నికల ప్రకటనకు మూడు నెలల ముందు నుంచే తరచు రాష్ట్రంలో పర్యటిస్తూ వచ్చిన ప్రధాన మంత్రి, పలు కీలక నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం, రోడ్‌షోలు సాగించారు. చేతులో ఉన్న వ్యవధిని దృష్టిలో ఉంచుకుని మరో 20కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి హైలైట్‌గా ఈనెల 6న బెంగళూరులో మెగా రోడ్‌షోకు సన్నాహాలు జరుగుతున్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 37 కిలోమీటర్ల మేరకు సాగే ఈ రోడ్‌షోలో 10 లక్షల మంది పాల్గొంటారని పార్టీ వర్గాల అంచనాగా ఉంది. 8 గంటల పాటు రెండు విడతలుగా ఈ రోడ్‌షో సాగనుంది. తొలి విడత రోడ్‌షో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సాగుతుంది. రెండో విడత మధ్యాహ్నం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకూ జరుగుతుంది.

తొలి విడత రోడ్‌షో బెంగళూరులోని సురంజన్ దాస్ రోడ్, మహదేవ్‌పుర, కేఆర్ పురం, శివాజీ నగర్, సీఆర్ రామన్ నగర్, శాంతి నగర్ మీదుగా సాగి బ్రిగేడ్ రోడ్డులోని వార్ మెమోరియల్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది. సిటీలోని రెండు అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు తొలి ఫేజ్‌ రోడ్‌షోలో ఉండగా, ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

కాగా, రెండో విడత రోడ్‌షో దక్షిణ బెంగళూరు మీదుగా సాగుతుంది. పద్మనాభనగర్, విజయ్‌నగర్, బసవన్‌గుడి, గాంధీనగర్, మహాలక్ష్మి లేఅవుట్, గోవింద్‌రాజ్ నగర్, రాజాజీ నగర్, మల్లేశ్వరం మీదుగా రోడ్‌షా సాగుతుంది. బెంగళూరులోని 11 నియోజకవర్గాలను కలుపుతూ 6 గంటల సేపు 26.6 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగనుంది. కర్ణాటకలోని 224 సభ్యుల అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుండగా, దీనికి ముందే మే 10న పోలింగ్ జరుగనుంది. మే 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-03T18:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising