ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM modi Elon Musk: ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్‌తో భేటీ కాబోతున్న ప్రధాని మోదీ..

ABN, First Publish Date - 2023-06-20T15:36:22+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi US visit) టెస్లా సీఈవో, ట్విటర్ (Twitter) యజమాని ఎలాన్ మస్క్‌తో (Elon musk) భేటీ కాబోతున్నారు. భారత్‌లో కంపెనీ ఏర్పాటు కోసం టెస్లా అనువైన లోకేషన్‌ను అన్వేషిస్తున్న సమయంలో మస్క్‌ని మోదీ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా (America) పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi US visit) టెస్లా సీఈవో, ట్విటర్ (Twitter) యజమాని ఎలాన్ మస్క్‌తో (Elon musk) భేటీ కాబోతున్నారు. భారత్‌లో కంపెనీ ఏర్పాటు కోసం టెస్లా అనువైన లోకేషన్‌ను అన్వేషిస్తున్న సమయంలో మస్క్‌ని మోదీ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో కంపెనీ ఏర్పాటు ఏమైనా స్పష్టమైన ప్రకటన లేదా అవగాహన ఏమైనా కుదురుతుందా అనే ఆసక్తి నెలకొంది. కాగా చివరిసారిగా 2015లో కాలిఫోర్నియాలో టెస్లా మోటార్స్ సీఈవోగా ఉన్న సమయంలో మస్క్‌ను మోదీ కలిశారు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కలవబోతున్నారు. ఇదిలావుండగా భారత్ మార్కెట్‌పై ఆసక్తిగా ఉన్నారా అనే ప్రశ్నకు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇంటర్వ్యూలో మస్క్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘కచ్చితమైన ఆసక్తి ఉంది’’ అని తేల్చిచెప్పారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది చివరి లోగా లోకేషన్ ఖరారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రముఖులతో మోదీ భేటీలు...

భారత ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటనలో వేర్వేరు రంగాలకు చెందిన 2 డజన్లకుపైగా ప్రముఖులతో భేటీ కాబోతున్నారు. ఈ జాబితాలో నోబెల్ అవార్డ్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, స్కాలర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వైద్యరంగానికి చెందిన నిపుణులు ఉన్నారు. అమెరికా పురోగమిస్తున్న తీరుని అర్థం చేసుకోవడమే లక్ష్యంగా వీరందరితోనూ ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడనున్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వేర్వేరు అంశాల్లో సహకారంపై కూడా దృష్టిసారించనున్నారని అధికారులు వివరించారు. మస్క్‌తోపాటు ఖగోళశాస్త్రవేత్త నీల్ డీగ్రాస్సె టైసన్, ఆర్థికవేత్త పాల్ రోమర్, స్టాటస్టీసియన్ నికోలస్ నాసీమ్, ఇన్వెస్టర్ రే డాలియో ఈ జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కాగా మంగళవారమే ప్రధాని మోదీ పర్యటన అమెరికాలో మొదలైంది.

Updated Date - 2023-06-20T15:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising