Raksha Bandhan : మోదీకి రాఖీ ఎవరు కట్టారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-08-30T15:47:49+05:30
అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఈ పండుగను హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఈ పండుగను హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఢిల్లీ పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. కొందరు బాలికలు ఆయన బొమ్మతో తయారు చేసిన రాఖీలను ఆయన చేతికి కట్టారు.
మోదీ ఢిల్లీలోని ఓ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలుపుగోలుగా మాట్లాడారు. విద్యార్థినులు ఆయనకు రాఖీలు కట్టారు. కొందరు మోదీ ఫొటోతో తయారు చేసిన రాఖీలను ఆయనకు కట్టారు. ఆ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బాలబాలికలతో కలిసి ఆయన ఫొటో దిగారు.
రాఖీ పండుగ సందర్భంగా జమ్మూ-కశ్మీరు బాలికలు భారత సైనికులకు రాఖీలు కట్టారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ, సైనికులు తమను కాపాడుతున్నారని, అందుకే ఓ తోబుట్టువుగా వారి సేవలను గుర్తించడం మన బాధ్యత అని చెప్పింది. వారికి కట్టిన రాఖీలు వారిని కాపాడతాయనే విశ్వాసం ఉందని తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆత్మీయత, నమ్మకాలకు సంబంధించిన ఈ పండుగ సమాజంలో సామరస్యాన్ని, మహిళలపట్ల గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Updated Date - 2023-08-30T15:47:49+05:30 IST