The Kerala Story: బళ్లారి సభలో కేరళ స్టోరీపై ప్రధాని ఏమన్నారంటే?
ABN, First Publish Date - 2023-05-05T16:51:02+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కేరళ స్టోరీ (The Kerala Story) ప్రస్తావన తెచ్చారు.
బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections 2023) ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కేరళ స్టోరీ (The Kerala Story) ప్రస్తావన తెచ్చారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే కేరళ స్టోరీ అనే సినిమాను కాంగ్రెస్ ( Congress) అడ్డుకునే యత్నం చేస్తోందని మోదీ బళ్లారి (Ballari) బహిరంగసభలో ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్‌తో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. బీజేపీ మొదట్నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోదీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్‌కు కడుపులో నొప్పి పుడుతుందని మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని మోదీ మండిపడ్డారు. డబ్బుతో తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు.
కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో కేరళ స్టోరీని రూపొందించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా వెల్లడించారు.
మోదీ ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. కర్ణాటకలో ఈ నెల 8న ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-05-05T22:28:42+05:30 IST