ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: మరోసారి దీపావళి జరుపుకుంటామన్న ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని బీజేపీ దోచుకుందన్న రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2023-11-14T18:40:31+05:30

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. ఓటర్లను ఆకర్షించేందుకు లెక్కలేనన్ని హామీలిస్తూనే.. పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ..

Madhya Pradesh Elections: ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. ఓటర్లను ఆకర్షించేందుకు లెక్కలేనన్ని హామీలిస్తూనే.. పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ.. ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఎటాక్ చేస్తే, రాహుల్ గాంధీ అందుకు కౌంటర్ ఎటాక్ చేశారు. మరోసారి దీపావళి జరుపుకోవడం ఖాయమని మోదీ జోస్యం చెప్తే.. తాము 150 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ ఏమన్నారు?

నవంబర్ 17వ తేదీ దగ్గరపడే కొద్దీ.. కాంగ్రెస్ వాదనల వాస్తవికత వెలుగులోకి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. తమ ఓటమి తథ్యమని కాంగ్రెస్ గ్రహించిందని, అందుకే వాళ్లు విధిపై ఆధారపడ్డారని చురకలంటించారు. మోదీ హామీల ముందు తమ తప్పుడు వాగ్దానాలు నిలబడవని కాంగ్రెస్‌కు తెలుసని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కేవలం దోచుకోవడం మాత్రమే తెలుసని ఆరోపించిన మోదీ.. వారి దోపిడీ, అవినీతి మరోసారి మధ్యప్రదేశ్ ఖజానాను తాకకూడదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీన దేశం రెండోసారి దీపావళి జరుపుకోనుందని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం, రామ మందిర నిర్మాణం వాస్తవమవుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని.. తాము ఇవన్నీ చేసి చూపించామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. భారతీయుల చేతుల్లో మేడ్-ఇన్-చైనా ఫోన్లు ఉన్నాయని రాహుల్ చెప్పారని.. మన భారతదేశం సాధించిన విజయాలు చూడలేని రోగం వారికి ఉందని నిప్పులు చెరిగారు. నేడు భారతదేశం మొబైల్ ఫోన్‌ల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించిందని మోదీ చెప్పుకొచ్చారు.


రాహుల్ గాంధీ కౌంటర్

మరోవైపు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈసారి తమ కాంగ్రెస్ పార్టీలు మధ్యప్రదేశ్‌లో తప్పకుండా 145 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. బీజేపీ నాయకులైన మోదీ, శివరాజ్ సింగ్, అమిత్ షా కలిసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. తాత్కాలిక ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నో మంచి పనులు చేస్తే.. ఆ ప్రభుత్వాన్ని దోచుకుని, రాష్ట్ర ప్రజలను బీజేపీ ఇబ్బందులకు గురి చేసిందని దుయ్యబట్టారు.

Updated Date - 2023-11-14T18:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising