ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP : ఎన్డీయే స్వార్థం చూసుకోదు : మోదీ

ABN, First Publish Date - 2023-08-01T10:48:57+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) రానున్న లోక్ సభ ఎన్నికలకు బీజేపీని సమాయత్తం చేస్తున్నారు. ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయోధ్య రామాలయం గురించి మాత్రమే కాకుండా స్థానిక అంశాలను ప్రజలతో ప్రస్తావించాలని చెప్తున్నారు.

Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) రానున్న లోక్ సభ ఎన్నికలకు బీజేపీని సమాయత్తం చేస్తున్నారు. ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయోధ్య రామాలయం గురించి మాత్రమే కాకుండా స్థానిక అంశాలను ప్రజలతో ప్రస్తావించాలని చెప్తున్నారు. మొత్తం ఎంపీలను బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందంతో ఒక్కొక్క రోజు మాట్లాడుతున్నారు. మంగళవారం ఉత్తర ప్రదేశ్ ఎంపీలతో మాట్లాడారు. ఇటువంటి సమావేశాలు ఈ నెల 10 వరకు జరుగుతాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మోదీ మంగళవారం పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బ్రజ్, కాన్పూర్-బుందేల్‌ఖండ్ ప్రాంతాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతో సమావేశమయ్యారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలతో స్థానిక సమస్యల గురించి మాట్లాడాలని, ప్రజలు పాల్గొనే పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు హాజరవాలని తెలిపారు. ప్రభుత్వంపై కాస్త కోపంగా ఉన్నవారితో ఎక్కువగా మాట్లాడి, వారికి నచ్చజెప్పాలని తెలిపారు.

పొత్తు ధర్మాన్ని ఎన్డీయే పాటిస్తుందని, యూపీయే మాదిరిగా కాదని చెప్పారు. ఎన్డీయే త్యాగాలు చేస్తుందన్నారు. ఎన్డీయేకు స్వార్థం లేదన్నారు. ఉదాహరణకు బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేశామన్నారు. నితీశ్ కూటమి ధర్మాన్ని వదిలిపెట్టి, ప్రతిపక్షాలతో చేతులు కలిపారన్నారు. అదే విధంగా పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకున్నపుడు, తమకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పదవిని కోరలేదని చెప్పారు.


430 మంది ఎన్డీయే ఎంపీలను 11 బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందంతో ఒక్కొక్క రోజు మోదీ సమావేశమవుతున్నారు. తదుపరి సమావేశం బుధవారం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా వంటి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి :

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. విధులు విస్మరించి విమర్శించడమే ఆయన పని

Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..

Updated Date - 2023-08-01T10:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising