ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Giriraj Singh: ఆలయం ప్రారంభం కంటే రాహుల్ 'న్యాయ్ యాత్ర' ముఖ్యమా?

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:30 PM

అయోధ్యలో భవ్య రామాలయం జనవరి 22న ప్రారంభం కానుండగా, దీనికి కొద్ది ముందుగా భారత్ జోడో యాత్ర తతహాలో రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి ''భారత్ న్యాయ్ యాత్ర'' చేపడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై కేంద్ర మంది గిరిరాజ్ సింగ్ సూటిగా స్పందించారు. రాహుల్ 'న్యాయ్ యాత్ర' తమ పార్టీకి, ప్రజలకు పెద్ద విశేషమేమీ కాదని అన్నారు.

బెగుసరాయ్: అయోధ్యలో భవ్య రామాలయం జనవరి 22న ప్రారంభం కానుండగా, దీనికి కొద్ది ముందుగా భారత్ జోడో యాత్ర తతహాలో రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి ''భారత్ న్యాయ్ యాత్ర'' చేపడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై కేంద్ర మంది గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) సూటిగా స్పందించారు. రాహుల్ 'న్యాయ్ యాత్ర' తమ పార్టీకి, ప్రజలకు పెద్ద విశేషమేమీ కాదని అన్నారు. అబూ దాబి (Abu dhabi)లో హిందూ ఆలయం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం రావడం దేశానికి అత్యంత ప్రాధాన్యమైన విషయమని అన్నారు.


సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14 నుంచి 'న్యాయ్ యాత్ర'ను కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమై పశ్చిమాన మహారాష్ర వరకూ పాదయాత్ర జరుగనుంది. 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగి మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. 14 రాష్ట్రల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగుతుంది. యాత్ర నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్ర చేరుకుటుంది.


న్యాయ్ యాత్రా? జ్ఞాన్‌యాత్రా?

జనవరి 14న రాహుల్ ప్రారంభించేది న్యాయ్ యాత్రా, జ్ఞాన్ యాత్రా అనేది రాహుల్ నిర్ణయించుకోవాలని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇది 21వ శాతాబ్దంలో, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పురోగమిస్తున్న ఇండియా అని, అబూ ధాబీలో ఆలయం ప్రారంభించాలని వచ్చిన ఆహ్వానాన్ని ప్రధాని మోదీ అంగీకరించడం భారతీయులమైన మనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయమని అన్నారు. వివేకానంద అడుగుజాడల్లో ప్రధాని నడుస్తున్నారని ప్రశంసించారు. అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలను గిరిరాజ్ సింగ్ తప్పుపట్టారు. శాంతికి విఘాతం కలిగించి, హింసను రేకెత్తించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సనాతన ధర్మం యావద్దేశాన్ని మేలుకొలిపిందని, ఆలయాలను కూలగొట్టి ఆ ప్రదేశంలో మసీదు కట్టే సాహసానికి ఏ బాబర్ (ముస్లిం నేత) నేత ఒడిగట్టలేరని అన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 04:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising