ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joshimath crisis: జోషీమఠ్‌లో 500 ఇళ్లకు పగుళ్లు... ప్రధాన మంత్రి కార్యాలయం కీలక సమావేశం...

ABN, First Publish Date - 2023-01-08T14:08:19+05:30

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోయి, దాదాపు 500 ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం

Joshimath
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోయి, దాదాపు 500 ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) చర్యలు ప్రారంభించింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బదరీనాథ్, హేమకుండ్ సాహిబ్, అంతర్జాతీయ స్కీయింగ్ సైట్ ఔలీ వంటి ప్రజాదరణగల ప్రదేశాలు ఇక్కడ ఉన్న సంగతి తెలిసిందే.

జోషీమఠ్‌లోని భూమి క్రమంగా కుంగిపోతుండటంతో రోడ్లు, ఇళ్లకు పెద్ద పగుళ్లు వస్తున్నాయి. ఓ దేవాలయం, కొన్ని ఇళ్లు కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో సమీక్షా సమావేశం ఆదివారం జరుగుతుందని పీఎంఓ తెలిపింది. ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొంది. జోషీమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపింది.

ఇదిలావుండగా, జోషీమఠ్‌లో ఓ దేవాలయం, కొన్ని ఇళ్లు కూలిపోయిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పర్యటించారు. ఈ ప్రభావానికి గురైన సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు.

మరోవైపు భూమి కుంగిపోవడానికి కారణాలేమిటో అత్యంత వేగంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-01-08T14:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising