America : వయసు 75 ఏళ్లు పైబడితే ఆ పరీక్షలు చేయించాలా?... జో బైడెన్ సతీమణి సమాధానం ఇదే...
ABN, First Publish Date - 2023-03-08T19:01:57+05:30
సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో పరీక్షలు చేయించాలనే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సతీమణి జిల్ బైడెన్
వాషింగ్టన్ : రాజకీయ నేతల వయసు 75 ఏళ్లు పైబడితే, వారి మానసిక సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో పరీక్షలు చేయించాలనే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సతీమణి జిల్ బైడెన్ (Jill Biden) తోసిపుచ్చారు. ఈ ప్రతిపాదన హాస్యాస్పదమని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కీ హేలీ (Nikki Haley) ఈ ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ పరీక్షలను నిర్వహించాలని నిక్కీ ప్రతిపాదించారు.
నిక్కీ హేలీ ప్రతిపాదనను అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ (Bernie Sanders) కూడా ఖండించారు. ఇది అర్థరహితం, వయసునుబట్టి వివక్ష చూపించడం అని దుయ్యబట్టారు. మనం రేసిజం, సెక్సిజం, హోమోఫోబియా వంటివాటితో పోరాడుతున్నామని, వయసునుబట్టి వివక్ష ప్రదర్శించడంపై కూడా పోరాడవలసి ఉందని చెప్పారు.
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి విజయం సాధిస్తే, తిరిగి ఆ పదవిని చేపట్టేనాటికి ఆయన వయసు 82 సంవత్సరాలు అవుతుంది. ఆయన మానసిక సామర్థ్య పరీక్ష చేయించుకుంటారా? అని అడిగినపుడు అమెరికన్ ప్రథమ మహిళ, జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ మాట్లాడుతూ, ‘‘అలాంటిదాని గురించి మేం ఎన్నడూ మాట్లాడుకోలేదు’’ అని చెప్పారు. 30 ఏళ్ల వయస్కుల్లో ఎందరు పోలండ్‌కు వెళ్ళగలరు? రైలు ప్రయాణం చేయగలరు? తొమ్మిది గంటలు ప్రయాణం చేసి ఉక్రెయిన్‌కు వెళ్ళగలరు? ఆ దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో సమావేశమవగలరు? అని ప్రశ్నించారు. ఇటీవల జో బైడెన్ చేసిన ప్రయాణాలను ఆమె ఈ విధంగా ప్రస్తావించి, ఆయన శక్తి, సామర్థ్యాల గురించి వివరించారు.
ఇవి కూడా చదవండి :
Karnataka : నోట్ల కట్టలతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యేపై అధిష్ఠానం ఆగ్రహం!
DU women’s hostel : హోళీ సంబరాలపై ఆంక్షలు... ఢిల్లీ విద్యార్థినుల నిరసన...
Updated Date - 2023-03-08T19:01:57+05:30 IST