ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం..

ABN, First Publish Date - 2023-05-28T16:36:56+05:30

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తు భారతీయులకు గర్వకారణం, ఆనందదాయకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తు భారతీయులకు గర్వకారణం, ఆనందదాయకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ సందేశాన్ని ఇచ్చారు.

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టాన్ని దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ద్రౌపది ముర్ము అన్నారు. మన ప్రజాస్వామిక ప్రస్థానంలో ఇది ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. ఆమె సందేశాన్ని నూతన పార్లమెంటులో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు.

దేశ హితం కోసం.. : మాయావతి

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బీఎస్‌పీ అధినేత్రి మాయావతి (Mayawati) కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఆమె ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఈ భవనాన్ని దేశ హితం కోసం ఉపయోగించాలని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మానవతావాద సిద్ధాంతాలు, భారత రాజ్యాంగ పవిత్ర ఉద్దేశాలకు అనుగుణంగా దీనిని ఉపయోగించాలన్నారు.

మాయావతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ, ఆమె ఇతర కారణాలను చూపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలను ఆమె ఈ నెల 25న దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి :

New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..

New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ

Updated Date - 2023-05-28T16:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising