ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Droupadi Murmu: పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి రెండ్రోజుల పర్యటన

ABN, First Publish Date - 2023-03-26T19:17:53+05:30

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27 నుంచి రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈనెల 27 నుంచి రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్‌(West Bengal)లో పర్యటించనున్నారు. ఆదివారంనాడు ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి తమ పర్యటనలో భాగంగా సోమవారంనాడు కోల్‌కతాలోని నేతాజీ భవన్‌ను సందర్శించి నేతాజీకి ఘనంగా నివాళులర్పిస్తారు. అనంతరం రబీంద్రనాథ్ ఠాగూర్ హౌస్‌కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తారు. 28వ తేదీన బేలూరు మఠాన్ని సందర్శిస్తారు. యూకో బ్యాంక్ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అనంతరం, శాంతినికేతన్ సందర్శించి విశ్వ-భారతి వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

కాగా, గత మార్చి 19న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వివేకానంద రాక్ మెమోరియల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శించడం తనకొక మరపురాని అనుభూతిని ఇచ్చిందని ఓ ట్వీట్‌లో ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దీనికి ముందు మార్చి 16 నుంచి 21వ తేదీ వరకూ వారం రోజుల పాటు కేరళ, తమిళనాడులో రాష్ట్రపతి పర్యటించారు.

Updated Date - 2023-03-26T19:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising