ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanaka Gandhi: ప్రజలు అధికార మార్పు కోరుతున్నారు..

ABN, First Publish Date - 2023-07-21T17:59:41+05:30

మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. గ్వాలియర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా సొంత నియోజకవర్గమైన గ్వాలియర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. దీనికి ముందు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి లక్ష్మీబాయ్‌కి ఆమె ఘనంగా నివాళుర్పించారు. గత 40 రోజుల్లో మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ పర్యటించడం ఇది రెండోసారి.


ప్రధాని నరేంద్ర మోదీపై గ్వాలియర్‌ ర్యాలీలో ప్రియాంక విమర్శలు గుప్పించారు. పొలిటికల్ డీసెన్సీ లేకుండా మోదీ మాట్లాడుతున్నారని, సీనియర్ వివిక్ష నేతలను దొంగలతో పోల్చి మాట్లాడుతున్నారని అన్నారు. మణిపూర్‌ మండిపోతుంటే 77 రోజుల తర్వాత, అది కూడా ఒక మహిళపై దారుణమైన అకృత్యం వెలుగుచూసిన తర్వాత మోదీ పెదవి విప్పారని విమర్శించారు. తాను ఈ వేదికపై నుంచి బీజేపీ విఫల రాజకీయాలు, పాలన, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ గురించి మాట్లాడవచ్చని, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అకస్మాత్తుగా తన సిద్ధాంతాలను ఎందుకు మార్చుకున్నారో మాట్లాడగలనని, అయితే తాను ప్రజాసమస్యల గురించే మాట్లడదలచుకున్నానని, ధరల పెరుగుదల అతిపెద్ద ప్రజాసమస్యగా పరిణమించిందని అన్నారు.


కాగా, జూన్ 12న జబల్‌పూర్ ర్యాలీలోనూ ప్రియాంక పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఐదు పథకాలను అమలు చేస్తామని వాగ్దానం చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని, 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) పునరుద్ధరస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పి, తన విధేయులైన ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో 15 నెలల సింధియా ప్రభుత్వం అధికారం కోల్పోయింది. చౌహౌన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది.

Updated Date - 2023-07-21T18:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising