ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wrestlers protest :జంతర్ మంతర్‌కు వచ్చిన ప్రియాంకగాంధీ...రెజ్లర్లకు ఆందోళనకు మద్ధతు

ABN, First Publish Date - 2023-04-29T09:54:05+05:30

మహిళా రెజ్లర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ శనివారం మద్ధతు తెలిపారు....

Priyanka Gandhi support to Wrestlers
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ శనివారం మద్ధతు తెలిపారు. శనివారం ఉదయం ప్రియాంకగాంధీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకొని(Priyanka Gandhi reaches Jantar Mantar) రెజ్లర్లకు మద్ధతు ప్రకటించారు.(Extends Support) బ్రిజ్ భూషణ్ సింగ్ ను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.నమోదైన కేసుల్లో ఏముందో ఎవరికీ తెలియదని ప్రియాంక చెప్పారు. ‘‘రెజ్లర్లు పతకాలు సాధించినపుడు మనమందరం ట్వీట్లు చేసి గర్వపడతాం, కానీ నేడు వారికి న్యాయం జరగక పోవడంతో రోడ్డుపై కూర్చున్నారు.’’అని ప్రియాంక అన్నారు.

ఇది కూడా చదవండి : Shraddha Walkar case : శ్రద్ధావాకర్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు నేడు

2012 నుంచి 2022 వరకు 10 సంవత్సరాల కాలంలో లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏప్రిల్ 21వతేదీన ఏడుగురు మహిళా రెజ్లర్లు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోఘట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను(Wrestlers protest) కొనసాగించారు.కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కూడా క్రీడాకారులకు మద్ధతుగా నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా శనివారం నిరసనలో ఉన్న రెజ్లర్లను పరామర్శించనున్నారు.

Updated Date - 2023-04-29T09:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising