ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Save Electricity: ప్రభుత్వ కార్యాలయాల వేళలు మార్చిన సీఎం

ABN, First Publish Date - 2023-04-08T18:05:13+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారంనాడు అనూహ్య నిర్ణయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) శనివారంనాడు అనూహ్య నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల (Government Offices) పని వేళలను (Working hours) మారుస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. కొత్త పనివేళలు ఈ ఏడాది మే 2వ తేదీ నుంచి జూలై 15 వరకూ అమల్లో ఉంటాయి. విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలుగా ఆయన ఈ మార్పులు చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు త్వరగా తెరిచి వేసవి ఉష్ణోగ్రత పెరగడానికి ముందే మూసివేసినట్లయితే రాష్ట్రంలో విద్యుత్ ఆదా చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని సీఎం మాన్ తెలిపారు. ఇందువల్ల పవర్ గ్రిడ్‌లపై ఒత్తడి తగ్గి, విద్యుత్ ఆదా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటున్న తరుణంలో మాన్ సర్కార్ తాజా చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో బొగ్గు నిల్వల కొరత కారణంగా తీవ్రమైన విద్యుత్ కొరత తలెత్తింది. మాన్ తాజా నిర్ణయంతో కీలకమైన వేళల్లో విద్యుత్ శాఖ సమర్ధవంతంగా కరెంట్ సరఫరా చేయగలుగుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-04-08T18:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising