Punjab: పంజాబ్ మంత్రివర్గ విస్తరణ...ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు
ABN, First Publish Date - 2023-05-31T07:10:49+05:30
పంజాబ్ రాష్ట్రంలో బుధవారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది.బుధవారం పంజాబ్ కేబినెట్ మంత్రులుగా ఎమ్మెల్యేలు బాల్కర్ సింగ్, గుర్మీత్ సింగ్ ఖుడియాన్‌లను చేర్చుకోనున్నారు... కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఆమోదం తెలపాలని సీఎం భగవంత్ మాన్ అభ్యర్థించారు.
చండీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో బుధవారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది.బుధవారం పంజాబ్ కేబినెట్ మంత్రులుగా ఎమ్మెల్యేలు బాల్కర్ సింగ్, గుర్మీత్ సింగ్ ఖుడియాన్‌లను చేర్చుకోనున్నారు.కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఆమోదం తెలపాలని సీఎం భగవంత్ మాన్ అభ్యర్థించారు.(Punjab govt)ప్రస్తుతం పంజాబ్‌లో 15 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు.పంజాబ్ మంత్రివర్గంలో మొత్తం 18 బెర్త్‌లు ఉన్నాయి.స్థానిక ప్రభుత్వ మంత్రి ఇందర్‌బీర్ సింగ్ నిజ్జర్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాజీనామాను ఆమోదం కోసం పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నిజ్జర్ రాజీనామాను ఆమోదించాలని మన్ గవర్నర్‌కు సమాచారం పంపించారు. జలంధర్‌లోని కర్తార్‌పూర్ ఎమ్మెల్యే బాల్కర్ సింగ్, ముక్త్‌సర్‌లోని లంబి స్థానం నుంచి ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ ఖుదియాన్‌ల(MLAs Balkar Singh, Gurmeet Singh Khudian) పేర్లను కేబినెట్ మంత్రులుగా (cabinet ministers)చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం మాన్ బుధవారం ఇక్కడ తన అధికారిక నివాసంలో విందు ఇవ్వనున్నారు, ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతారు.ఆర్డినెన్స్ ఔట్రీచ్ గురించి వారికి వివరించే అవకాశం ఉంది.ఢిల్లీ సర్వీసుల విషయంలో కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పార్టీల మద్దతును కోరుతోంది.
Updated Date - 2023-05-31T07:51:31+05:30 IST