ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: రాహుల్ గాంధీకి స్పోర్ట్స్‌ కోటాలో సీటు.. ఇంతకీ ఆయన ప్రతిభ చూపిన క్రీడ ఏంటో తెలుసా.. భగ్గుమన్న విపక్షాలు..

ABN, First Publish Date - 2023-06-19T20:12:37+05:30

అది..1989 జూలై 10. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్‌ కాలేజీలో ఫ్రెషర్స్ డే . సీనియర్ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఫ్రెషర్స్‌తో సందడిగా ఉంది. బ్లాక్ సఫారీ సూట్లు ధరించిన సాయుధ కమెండోల పర్యవేక్షణలో 5.7 అడుగుల ఎత్తున్న 19 ఏళ్ల నవయువకుడు అక్కడకు వచ్చాడు. ఆ యువకుడు మరెవరో కాదు రాహుల్. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు సీటు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అది..1989 జూలై 10. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్‌ (St.Stephen) కాలేజీలో ఫ్రెషర్స్ డే (Fresher's Day). సీనియర్ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఫ్రెషర్స్‌తో సందడిగా ఉంది. బ్లాక్ సఫారీ సూట్లు ధరించిన సాయుధ కమెండోల పర్యవేక్షణలో 5.7 అడుగుల ఎత్తున్న 19 ఏళ్ల నవయువకుడు అక్కడకు వచ్చాడు. అతని చేతిలో కొన్ని పుస్తకాలు, జేబులో ఒక హీరో ఫౌంటెన్ ఫెన్ ఉన్నాయి. ఇతనెవరై ఉంటాడు? అందరి దృష్టి అతనిపైనే పడింది. ఆ కుర్రవాడు తన సెక్యూరిటీ గార్డులను దూరంగా వెళ్లమని చెప్పాడు. సెయింట్ స్పీఫెన్స్ కాలేజీలో ఎంఏ హిస్టరీలో సీటు సంపాదించుకుని ఫ్రెషర్ డే‌లో పాల్గొన్న ఆ యువకుడు మరెవరో కాదు, దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ.

మార్కులు తక్కువే అయినా సీటు.. ఎలా..?

సీబీఎస్‌సీ స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం రాహుల్‌కు ఇంటర్‌లో వచ్చిన మార్కులు 61 శాతం. నిజానికి ఆ మార్కులతో కాలేజీలో సీటు రాదు. అయినప్పటికీ స్టీఫెన్ కాలేజీలో రాహుల్‌కు సీటు వచ్చింది. స్పోర్ట్స్ కోటా పుణ్యమా అని ఆయనకు సీటు దక్కింది. ఈ కోటా కింద 10 శాతం మార్కులు కలిసాయి. ఇంతకూ ఆయనకు సీటు తెప్పించిన క్రీడ ఏమింటే...రైఫిల్ షూటింగ్. 1989 జూలైలో జరిగిన ఢిల్లీ షూటింగ్ కాంపటీషన్‌‌లో ఆయన స్వర్ణపతకం గెలుచుకున్నారు. అంతేకాదు, షూటింగ్‌లో ఆయన 8 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు.

అప్పట్లో వివాదం..

రాహుల్‌కు స్పీఫెన్ కాలేజీలో సీటు దక్కడం అప్పట్లో పతాక శీర్షికల్లోకి కనిపించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ ఖురానా.. రాహుల్ అడ్మిషన్‌ను నిలదీశారు. రైఫిల్ షూటింగ్‌లో రాహుల్ ప్రతిభాపాటవాలపై ఆయన ప్రశ్నలు గుప్పించారు. అవేవీ చెల్లుబాటు కావనీ, నకిలీ డాక్యుమెంట్లతో సీటు దక్కించుకున్నారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఓ కార్యక్రమంలో పనిచేసే రాజీవ్ గాంధీ మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు సుమన్ దుబే వెంటనే రంగంలోకి దిగారు. రాహుల్ అడ్మిషన్‌ను స్వాగతిస్తూ, 19 ఏళ్ల ప్రాయంలో ఎంతమంది యువకులు జాతీయ స్థాయిలో 8 మెడల్స్ గెలుచుకున్నారు? అని ప్రశ్నించారు. నేషనల్ రైఫిల్ అసోసియోషన్ సైతం రైఫిల్ షూటింగ్‌లో రాహుల్ ప్రతిభాపాటవాలను వెల్లడించింది. 1988 డిసెంబర్ 26 నుంచి 1989 జనవరి 5 వరకూ జరిగిన 32వ జాతీయ షూటింగ్ కాంపటీషన్‌లో రాహుల్ 4వ స్థానంలో నిలిచారని, సెంటర్ ఫైర్ పిస్టల్ 25 ఎం (ఇండియన్ రూల్) మెన్స్ సివిల్ ఈవెంట్‌లో 400 పాయింట్లకు 371 పాయింట్లు గెలుచుకుని నాలుగో స్థానం సాధించారని తెలిపింది.

ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీలలో ఒకటైన స్టీఫెన్ కాలేజీ 1989లో 40 మంది విద్యార్థులను స్పోర్ట్స్ కోటాలో చేర్చుకుంది. వారిలో తొమ్మిది మంది హిస్టరీ (హానర్స్) కోర్సులో చేరారు. కాలేజీలో అడ్మిషన్ దక్కిన ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులకు రాహుల్‌కు వచ్చిన 61 శాతం కంటే తక్కువ మార్కులే వచ్చినట్టు ఆ కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ డెరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆసక్తికరంగా, నేషనల్ కాంపటీషన్‌లో రాహుల్ పాల్గొనడానికి ముందే తుగ్లగాబద్‌ రేంజెస్‌లో జరిగిన ఢిల్లీ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో రాహుల్ మూడు గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కాగా, రాహుల్ ఏడాదికే స్టీఫెన్స్ కాలేజీని విడిచిపెట్టారు. ఫ్లోరిడాకు వెళ్లారు. కేంబ్రిడ్జిలో హైయర్ డిగ్రీ పొందారు. అయితే, తాను చదవిని స్టీఫెన్ కాలేజీని మాత్రం రాహుల్ తరచు గుర్తుచేసుకునేవారు.

Updated Date - 2023-06-19T20:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising