ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mizoram: స్కూటీపై ప్రయాణించిన రాహుల్

ABN, First Publish Date - 2023-10-17T20:24:13+05:30

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిజోరంలో రెండో రోజు పర్యటిస్తున్న కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఒక స్కూటీపై ఐజ్వాల్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు బయలుదేరిన రాహుల్ ఒక స్కూటర్ వెనకాల హెల్మెట్ ధరించి కూర్చుని ప్రయణం సాగించారు.

ఐజ్వాల్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిజోరం (Mizoram)లో పర్యటిస్తున్న కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారంనాడు ఒక స్కూటీపై ఐజ్వాల్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు బయలుదేరిన రాహుల్ ఒక స్కూటర్ వెనకాల హెల్మెట్ ధరించి కూర్చుని ప్రయణం సాగించారు. మిజోరం కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.


బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు..

అనంతరం, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐజ్వాల్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. అధికార మిజో నేషనల్ ఫ్రెంట్‌(ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ (జేపీఎం)లను ఉపయోగించుకుని బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్టు ఆరోపించారు. తమ పార్టీ పూర్తిగా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుదని, బీజేపీని వ్యతిరేకంగా తాము ముందుకు వెళ్తామన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నుంచి ఈశాన్య భారత్‌లోని వివిధ రాష్ట్రాలు దాడులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని తొలగించి, రెండు వర్గాలను కలపాల్సి ఉందన్నారు. మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్ రికార్డు అందరూ చూశారని, నిరుద్యోగం పెరిగిపోయిందని, మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తి వైఫలమైందని అన్నారు. గత ఐదేళ్లలో 250 మంది యువకులు అశువులు బాసారని విమర్శించారు. ఇదే సమయంలో మిజోరం ఐడియాను వ్యతిరేకించిన వారికి ఎంఎన్ఎఫ్ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని అన్నారు.


60 శాతం ప్రజలకు ఇండియా కూటమి ప్రాతినిధ్యం

దేశంలోని 60 శాతం ప్రజలకు ఇండియా కూటమి (INDIA bloc) ప్రాతినిధ్యం వహిస్తోందని రాహుల్ చెప్పారు. మతాలు, సంస్కృతుల ప్రమేయం లేకుండా ప్రజల స్వేచ్ఛ, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ద్వారా దేశ భావనను ఇండియా కూటమి కాపాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ కాదని, ప్రతి రాష్ట్రానికి ఒక్కో విజన్ కలిగి ఉందని చెప్పారు. మిజోరం రాష్ట్రానికి సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1987లో రాష్ట్ర హోదా వచ్చిందని, ఇప్పటి యువ తరానికి మిజోరంలో హింస గురించి తెలియకపోవచ్చని, కానీ పాత తరం వారికి హింస వల్ల ఏమి కోల్పోయామన్నది బాగా తెలుసునని చెప్పారు. 1986లో తొలిసారి తాను మిజోరం వచ్చానని, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నానని అన్నారు.

Updated Date - 2023-10-17T20:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising