ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Phone Tapping: నా ఫోన్ కూడా తీసుకోండి, భయపడేది లేదు.. కేంద్రంపై రాహుల్ మండిపాటు

ABN, First Publish Date - 2023-10-31T15:07:47+05:30

ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భగ్గుమనడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయాలనుకుంటే అన్ని ఫోన్లు ట్యాప్ చేయండి.. నా ఫోన్ కూడా తీసుకోండి, భయపడేది లేదు..అని అన్నారు.

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం భగ్గుమనడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయాలనుకుంటే అన్ని ఫోన్లు ట్యాప్ చేయండి.. నా ఫోన్ కూడా తీసుకోండి, భయపడేది లేదు..అని అన్నారు. దేశంలోని పలువురు విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని, వారికి యాపిల్ సంస్థ నుంచి అలర్డ్ మెసేజ్‌లు కూడా వచ్చాయని ఆయన అన్నారు.


దీనికి ముందు, పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఐ ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మెసేజ్‌లు అందుకున్న వారిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరా ఉన్నారు. వీరంతా తమ ఐ ఫోన్‌లకు వచ్చిన అలర్ట్ మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాలను ట్యాగ్ చేశారు.


ఇది నేరగాళ్లు, దొంగలు చేసే పని..

కాగా, విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ''మీరు ఎన్ని ఫోన్లు హ్యాకింగ్ చేయాలని అనుకుంటారో అన్నీ చేయండి. నా ఫోన్ కూడా తీసుకోండి. నేను భయపడను. ఇది నేరగాళ్లు, దొంగలు చేసే పని. మా కార్యాలయానికి చెందిన అనేక మందికి ఈ మెసేజ్‌లు వచ్చాయి. కేసీ వేణుగోపాల్, సుప్రియ, పవన్ ఖేరకు కూడా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లు (బీజేపీ) దేశంలోని యువత దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని రాహుల్ అన్నారు.


నెంబర్ 1 అదానీ..

అదానీ అంశాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, గతంలో ప్రధాని మోదీని నెంబర్ 1గా, అదానీని నెంబర్ 2గా, అమిత్‌షాను నెంబర్ 3గా తాను చెప్పేవాడినని, అయితే అది సరికాదని అన్నారు. అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2, అమిత్‌షా నెంబర్ 3 అని, అదానీ తప్పించుకోలేరని, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది 'అదానీ సర్కార్' అంటూ రాహుల్ అభివర్ణించారు. ''ఇది ఆసక్తికరమైన సమస్య. నాదగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. టైము వచ్చినప్పుడు అదానీ ప్రభుత్వాన్ని తొలగించి చూపిస్తాం. దేశంలో అదానీ మోనపలైజేషన్ నడుస్తోంది. బీజేపీ ఆర్థిక వ్యవస్థ ఆయనతో (అదానీ) నేరుగా ముడిపడి ఉంది'' అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-31T15:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising