ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్ర సెకెండ్ ఫేజ్ గుజరాత్ నుంచి..

ABN, First Publish Date - 2023-08-08T21:13:26+05:30

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర ఫేజ్-2కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయతో ముగియనుంది.

ముంబై: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర ఫేజ్-2కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) నుంచి ప్రారంభమై ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)తో ముగియనుంది. యాత్రామార్గం, తేదీల వివరాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సెప్టెంబర్‌లో యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.


భారత్ జోడో యాత్ర ఫేజ్-2 గుజరాత్ నుంచి రాహుల్ ప్రారంభిస్తారని, మేఘాలయకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారంనాడు తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు సమాంతరంగా మహారాష్ట్రలోనూ పార్టీ నేతలు యాత్ర చేపడతారని తెలిపారు.


రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7 కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 3,970 కిలోమీటర్ల మేర, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 130 రోజుల పాటు యాత్ర కొనసాగి ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది.

Updated Date - 2023-08-08T21:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising