Rahul Gandhi: రైలులో ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ.. దీని వెనుక దాగి ఉన్న అసలు కథ ఇదే!
ABN, First Publish Date - 2023-09-25T20:31:40+05:30
గతంతో పోలిస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు.. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి..
గతంతో పోలిస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు.. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతrసారి.. ప్రజలతో కాలం గడిపేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్‌లో ప్రయాణించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్ తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ ట్రైన్‌లో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) ఖాతాలో షేర్ చేసింది. రాహుల్‌ని జననాయక్‌గా సంబోధిస్తూ.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు రాహుల్ ట్రైన్‌లో ప్రయాణం చేశారని పోస్ట్ పెట్టింది. వీడియోలో ఆయన స్లీపర్ కోచ్‌లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. రైలు ప్రయాణ సేవలు ఎలా ఉన్నాయి? ప్రయాణంలో భాగంగా సాధారణ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? తదితర విషయాలపై రాహుల్ గాంధీ ప్రయాణికులతో ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది.
తొలుత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వ గృహ న్యాయ సదస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు బిలాస్‌పూర్ జిల్లాలోని తఖత్‌పూర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పర్సదా గ్రామానికి వచ్చారు. అక్కడ సమావేశంలో ప్రసంగించిన అనంతరం బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని, రాయ్‌పూర్ వెళ్లేందుకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్‌లతో పాటు ఇతర నేతలు కూడా రైలులో ప్రయాణించారు. కాగా.. ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేసినందున, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైల్ రోకో నిరసనలను నిర్వహించిన విషయం తెలిసిందే!
Updated Date - 2023-09-25T20:31:40+05:30 IST