ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Railways : ఇది ఏ రైలో చెప్పుకోండి చూద్దాం.. ప్రజలకు రైల్వే మంత్రి సవాల్..

ABN, First Publish Date - 2023-05-31T17:57:52+05:30

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railways minister Ashwini Vaishnaw) బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి, ఇది ఏ రైలో ‘చెప్పుకోండి చూద్దాం’ అన్నారు. ప్రజలు ఊహించడం కోసం ఓ సూచన కూడా చేశారు. దీంతో కొందరు యూజర్లు తమ మెదడుకు పదునుపెడుతున్నారు.

అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘తయారీలో ఉన్న ఈ రైలు ఏదో ఊహించండి!? సూచన : జాక్ ఎన్ జిల్ వెంట్ అప్ ది హిల్’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పోస్ట్ చేసిన ఫొటోలో కనిపిస్తున్న రైలు బోగీలో కిటికీలు చాలా విశాలంగా ఉన్నాయి. ఇరువైపులా సింగిల్ సీట్లు ఉన్నాయి.

కొందరు యూజర్లు స్పందిస్తూ ఇది కల్కా-సిమ్లా మార్గంలో ప్రవేశపెట్టాలనుకుంటున్న కొత్త టాయ్ ట్రెయిన్‌కు సంబంధించినదని చెప్పారు. మరొక ట్విటరాటీ స్పందిస్తూ, అమెరికా ప్రెసిడెన్షియల్ రైలు తరహాలో ఓ రైలును నిర్మించాలని భారతీయ రైల్వేలను కోరారు. మరొక యూజర్ స్పందిస్తూ, దీనిని చూస్తే మనసంతా సంతోషంతో నిందిపోయిందని చెప్పారు.

కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కల్కా-సిమ్లా హెరిటేజ్ ట్రాక్ కోసం నాలుగు అడ్వాన్స్‌డ్ విస్టాడోమ్ నేరో గేజ్ కోచెస్‌‌ను విడుదల చేసింది. వీటి పై కప్పును గాజు అద్దాలతో నిర్మించారు. వీటి కిటికీలు చాలా విశాలంగా ఉన్నాయి. ఆర్‌సీఎఫ్ జనరల్ మేనేజర్ ఆశిష్ అగ్రవాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ బోగీల ట్రయల్ రన్ కల్కా-సిమ్లా మార్గంలో జరుగుతుందన్నారు. ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీనిలో 12 సీట్లతో ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ కార్, 24 సీట్లతో ఒక ఏసీ చైర్ కార్, 30 సీట్లతో ఒక నాన్ ఏసీ చైర్ కార్ , పవర్-కమ్-లగేజ్, గార్డ్ కార్ ఒకటి ఉంటాయన్నారు. వీటి ట్రయల్ రన్ కోసం కల్కా రైల్వేస్‌కు అప్పగిస్తామన్నారు. వీటిని ఎప్పుడు ప్రారంభించాలో రైల్వే బోర్డు నిర్ణయిస్తుందన్నారు.

సిమ్లా మొదటి రైల్ లింక్ 1903లో ఏర్పాటైంది. కల్కా-సిమ్లా రైల్ ట్రాక్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో (UNESCO) 2009లో ప్రకటించింది. ఈ మార్గంలో 103 సొరంగాలు, 800 వంతెనలు, 919 మలుపులు, 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

NIA Raids : దక్షిణ కన్నడలో ఎన్ఐఏ సోదాలు

Rahul Gandhi : మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే.. : రాహుల్ గాంధీ

Updated Date - 2023-05-31T18:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising