IRCTC: ఐఆర్‌సీటీసీలో సమస్య... టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచిన రైల్వే
ABN, First Publish Date - 2023-07-25T13:56:41+05:30
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి పనిచేయని ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి.
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి. అయితే సాంకేతిక సమస్యను పరిష్కరించే వరకు రైలు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రైల్వేశాఖ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో కౌంటర్ టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. నాగ్‌పూర్ డివిజన్‌లో అదనంగా 6 పీఆర్‌ఎస్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. సెంట్రల్ రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో 22 స్టేషన్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి.
1) నాగ్‌పూర్-2 అదనపు కౌంటర్లు (మొత్తం 7 కౌంటర్లు)
2) వార్ధా - 1 అదనపు (మొత్తం 3)
3) బల్లార్షా-1 అదనపు (మొత్తం 2)
4) చంద్రపూర్-1 అదనపు (మొత్తం 3)
5) బెతుల్-1 అదనపు (మొత్తం 3)
6) అజ్ని-1 అదనపు (మొత్తం 4)
కాగా.. రైలు ప్రయాణికులు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ల నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాప్, వెబ్ సైట్ సరిగా పనిచేయని కారణంగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినప్పటికీ టికెట్లు బుక్ అవని పరిస్థితి. ఐఆర్‌సీటీసీని ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో కస్టమర్లు విపరీతంగా పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ సమస్య పరిష్కారానికి కసరత్తు జరుగుతోందని వెల్లడించింది.
Updated Date - 2023-07-25T13:56:41+05:30 IST