ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raind: భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABN, First Publish Date - 2023-11-10T10:35:01+05:30

రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తేని, కోవై, తిరుప్పూర్‌,

- తేని, కోవై, తిరుప్పూర్‌ జిల్లాల్లో కుండపోత

- వరదలో చిక్కుకొని రైతు మృతి

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తేని, కోవై, తిరుప్పూర్‌, నీలగిరి(Theni, Kovai, Tiruppur, Nilgiris) తదితర దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షానికి తేని జిల్లా ఆండిపట్టి సమీపంలో వరదలో చిక్కుకున్న ఓ రైతు మృత్యువాత పడ్డాడు. నీలగిరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు మేట్టుపాళయం-ఊటీ ఘాట్‌ రోడ్డులో మట్టిచెరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ జిల్లాలో గరిష్టంగా 23 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఈశాన్య రుతుపవనాలు...

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తేని జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 71 అడుగుల వైగై డ్యాం నీటిమట్టం గురువారం ఉదయం 8 గంటలకు 70 అడుగులకు చేరింది. ఈ డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకొని మిగులు జలాలను విడుదల చేసేందుకు ప్రజాపనుల శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా డ్యాం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వరద హెచ్చరిక కూడా జారీచేశారు. తేని, దిండుగల్‌, మదురై, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో కూడా కుండపోత వర్షం నమోదు కావడంతో ఆ జిల్లాల ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. తేని జిల్లా ఆండిపట్టి కండమనూరు, వీరపాండి, కంభం, బోడినాయకనూరు తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్న సమయంలో అడవి పందులు పంట పొలాల్లో చొరబడే అవకాశముందని భావించి తెప్పంబట్టి గ్రామానికి చెందిన వేలుస్వామి కుమారుడు మురుగన్‌ (55) కామాక్షిపురానికి చెందిన కన్నదేవన్‌ (50), విజయ్‌రాజ్‌, తంగమణి అనే నలుగురు కొండ దిగువ భాగంలో ఉన్న వారి పొలాల కాపలాకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కాలువలో వరద నీరు వేగంగా ప్రవహిస్తుండగా ఆ నలుగురు నీళ్లలో దిగి కాలువ దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఊహించని విధంగా వరద ప్రవాహం పెరగడంతో మురుగన్‌ వరదలో కొట్టుకుపోయాడ. దీనిపై రాజధాని పోలీ్‌సస్టేషన్‌లో అందజేసిన ఫిర్యాదు మేరకు ఆండిపట్టి అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు ఆరు గంటలు త్రీవంగా గాలించారు. అనంతరం రాత్రి 2 గంటలకు మురుగన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తేని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారీవర్షాల కారణంగా తేని, దిండుగల్‌, మదురై, నీలగిరి జిల్లాల్లో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమక్రమంగా బలపడుతోందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీవర్షాలు కొనసాగే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.

తిరుప్పూర్‌ జిల్లాలో 12 సెం.మీ వర్షం..

పరిశ్రమలు అధికంగా ఉన్న తిరుప్పూర్‌ జిల్లాలో భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో కూడా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించేలా పలు ప్రాంతాల్లో నివారణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లాలో కూడా పాఠశాలలకు కలెక్టర్‌ క్రీస్తురాజ్‌ సెలవు ప్రకటించారు.

కొట్టుకుపోయిన చెక్కార్‌గుడి కల్వర్టు...

తూత్తుకుడి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీవర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. చెక్కార్‌గుడి ప్రాంతంలో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో పదికి పైగా గ్రామాలకు వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ జిల్లాలో మనియాచ్చి ప్రాంతంలో 63 మి.మీ వర్షపాతం, గరిష్టంగా ఒట్టపిడారంలో 80 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీవర్షాల కారణంగా శుక్రవారం వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా ప్రధాన విద్యాధికారి రజిని సెలవు ప్రకటించారు.

ఊటీ కొండరైలు రద్దు..

భారీ వర్షాల కారణంగా కోవై - నీలగిరి జిల్లాల మధ్య ఘాట్‌రోడ్డులో నడుపుతున్న ఊటీ కొండరైలు సేవలను గురువారం రద్దు చేశారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళంయ నుంచి నీలగిరి జిల్లా ఊటీ వరకు దక్షిణ రైల్వే కొండ రైలు నడుపుతున్న మార్గంలో పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు పడటంతో ఈ నెల నాలుగో తేదీ నుండి కల్లార్‌ రైల్వేస్టేషన్‌ నుండి ఆడర్లీ వరకు చేపట్టిన మరమ్మతుల కారణంగా మూడు రోజులు కొండ రైలు సేవలు రద్దయ్యాయి. మళ్ళీ బుధవారం ఈ మార్గంలో ఆ రైలు సేవలు ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కారణంగా ఆ రైలు సర్వీసును గురువారం రద్దు చేశారు.

Updated Date - 2023-11-10T10:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising