ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Orange alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఆరంజ్ అలర్ట్ జారీ

ABN, First Publish Date - 2023-03-23T10:34:47+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది...

Rainfall
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది.(Rainfall) భారీ గాలులతో కురుస్తున్న వడగండ్ల వర్షంతో ఢిల్లీలో(Delhi) ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్, పంజాబ్(Punjab, Rajasthan) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.(IMD issues orange alert) హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : పడకగదిలోకి వెళ్లిన మహిళ...ఆ దృశ్యం చూసి షాక్

సుందరనగర్,మండీ, డల్ హౌసీ, చౌరీ, ధర్మశాల, కర్సాగ్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిశాయి.ఉనా,కంగ్రా, సిమ్లా, సోలన్ సకనాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో బలమైన గాలులతో కురిసిన వడగండ్ల వర్షం వల్ల పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోధుమ పంటకు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి సర్వే చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి : Amritpal Singh:మహిళలతో వివాహేతర సంబంధాలు...వీడియో కాల్స్‌లో ముద్దుల వర్షం...ఇదీ ఖలిస్థాన్ నేత నిర్వాకం

రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్(YELLOW ALERT FOR ANDHRA) జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Updated Date - 2023-03-23T10:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising